వైసీపీ తొమ్మిదో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో విజయసాయి రెడ్డిని నెల్లూరు పార్లమెంటు ఇంచార్జీగా ప్రకటించింది. మంగళగిరి స్థానంలో మార్పు చేసింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నిర్ణయాలు తీసుకుంటున్నది. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపికను ఆచితూచీ చేపడుతున్నది. ముందస్తుగా ఇంచార్జీలను ప్రకటిస్తున్నది. దాదాపు వారే అభ్యర్థులని ఇటీవలే సీఎం జగన్ వెల్లడించారు. అయినా.. అవసరమైన చోట ఇంచార్జీలను మార్చడానికి వెనుకాడటం లేదు. తాజాగా విడుదలైన తొమ్మిదో జాబితాలో ఈ మార్పు కనిపించింది.
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ మార్చి 1వ తేదీన సాయంత్రం తొమ్మిదో జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా రెండు అంశాలు కనిపించాయి. ఈ జాబితాలో విజయసాయి రెడ్డి పేరు కనిపించింది. మంగళగిరి ఇంచార్జీని మార్చిన అంశం కూడా కనిపించింది.
Also Read: జనసేన నుంచి వైసీపీలోకి హరిరామ జోగయ్య కుమారుడు
నెల్లూరు పార్లమెంటు ఇంచార్జీగా విజయసాయిరెడ్డిని వైసీపీ నిర్ణయించింది. కర్నూల్ ఇంచార్జీగా ఇంతియాజ్ (రిటైర్డ్ ఐఏఎస్), మంగళగిరి అసెంబ్లీ ఇంచార్జ్‌గా మురుగుడు లావణ్య పేర్లను ప్రకటించింది. అయితే.. మంగళగిరి సమన్వయ కర్తగా గంజి చిరంజీవిని గతంలో వైసీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ స్థానంలో మార్పు చేసింది.
మంగళగిరి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు లోకేశ్ బరిలో ఉండే అవకాశం ఉన్నది.