జనసేన నుంచి వైసీపీలోకి హరిరామ జోగయ్య కుమారుడు

By Mahesh K  |  First Published Mar 1, 2024, 9:27 PM IST

కాపు సామాజిక వర్గ పెద్దగా పేరున్న చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్ జనసేన పార్టీ నుంచి బయటికి వచ్చారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
 


పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు షాక్ తగిలింది. కాపు సామాజిక వర్గ పెద్దగా పేరున్న చేగొండి హరిరామజోగయ్య కుమారుడు జనసేన పార్టీని వీడారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ రోజే ఆయన తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో చేగొండి సూర్యప్రకాశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

జనసేన పార్టీకి మొన్నటి వరకు కాపు సామాజిక వర్గ పెద్దలుగా, ముఖ్య నాయకులుగా ఉన్న ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్యలు మద్దతు పలికారు. కానీ, తాడేపల్లిగూడెం సభలో జరిగిన పరిణామాలు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో వీరిద్దరూ గాయపడ్డారు. పవన్ కళ్యాణ్ పార్టీ మరిన్ని సీట్లు అడగాల్సిందని, అధికారంలోనూ వాటా అడగాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు హరిరామ జోగయ్య పలుమార్లు పవన్ కళ్యాణ్‌కు బహిరంగ లేఖలు కూడా రాశారు.

Latest Videos

Also Read: Money Laundering : పేటీఎం పేమెంట్ బ్యాంక్‌కు రూ. 5. 49 కోట్ల ఫైన్

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్ సభ్యుడిగా ఉన్నారు. ఇటీవల పరిణామాలు ముఖ్యంగా, టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల పంపకాల ప్రకటనలు వెలువడ్డాక పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే చేగొండి సూర్యప్రకాశ్ జనసేన పార్టీ విడిపెట్టారు. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. చేగొండి సూర్య ప్రకాశ్‌కు సీఎం జగన్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.

click me!