టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కోసమే ఆ ఎంపీ సీట్ పెండింగ్: వైసీపీ, టీడీపీలో జోరుగా చర్చ

By Nagaraju penumalaFirst Published Feb 23, 2019, 11:02 AM IST
Highlights

తోట త్రిమూర్తుల కోసమే కాకినాడ పార్లమెంట్ కు అభ్యర్థిని ప్రకటించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెట్టుకొస్తుందని ప్రచారం జరుగుతుంది. తోట త్రిమూర్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కురసాల కన్నబాబు తిరిగి కాకినాడ రూరల్ సమన్వయకర్తగా వెళ్లిపోనున్నట్లు తెలుస్తోంది. 

కాకినాడ: రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా తూర్పుగోదావరి జిల్లా. ఈ జిల్లాలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందని ఒక నమ్మకం. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలు ఎవరికి అంతుబట్టడం లేదట. 

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో చెప్పడం కష్టంగా మారడంతో అంచనాలు వెయ్యలేకపోతున్నారట. ఎవరు ఏ పార్టీలో ఉన్నారో అన్న విషయం ప్రతీరోజు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందట. 

పార్టీలలో వలసలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో తోట త్రిమూర్తులు పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. తాను పార్టీ మారేది లేదని ఆయన మీడియా ముందు మెత్తుకున్నా ఎవరు నమ్మడం లేదట. తోట త్రిమూర్తులు వైసీపీలో చేరకముందే ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ప్రచారం చేసేస్తున్నారు. 

తోట త్రిమూర్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం ఇప్పటికీ అలానే కొనసాగుతుంది. ఇప్పుడు కొత్తగా ఆయన వైసీపీలో ఎక్కడ నుంచి పోటీ చేస్తారో అన్న విషయంపై కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. 

రామచంద్రాపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న తోట త్రిమూర్తులు త్వరలో వైసీపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే తోట త్రిమూర్తులు ఇటీవలే వైసీపీకి చెందిన కీలక నేతలతో సమావేశమవ్వడం అందుకు బలాన్ని చేకూరుస్తోంది. 

తాను పార్టీలో చేరాలంటే రామచంద్రాపురం అసెంబ్లీ టికెట్ తన కుమారుడు పృథ్విరాజ్ కి ఇవ్వాలని అలాగే కాకినాడు ఎంపీ టికెట్ కూడా తనకే ఇవ్వాలని కండీషన్ పెట్టారట. కాకినాడ పార్లమెంట్ టికెట్ ఇచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. 

అయితే కుమారుడు పృథ్వీరాజ్ కి రామచంద్రాపురం టికెట్ ఇచ్చే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. రామచంద్రాపురం టికెట్ ఇస్తే ఆయన ఏ క్షణాన అయినా వైసీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతుంది. 

తోట త్రిమూర్తులు ఎట్టి పరిస్తితుల్లో తెలుగుదేశం పార్టీలో ఉండరని వైసీపీలో చేరడం ఖాయమని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సమన్వయ కర్తను నియమించకుండా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబుతో నడిపించేస్తున్నారు. 

కురసాల కన్నబాబు రాబోయే ఎన్నికల్లో కాకినాడ రూరల్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ ఎవరూ లేకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఆయనకే అప్పగించింది. 

తోట త్రిమూర్తుల కోసమే కాకినాడ పార్లమెంట్ కు అభ్యర్థిని ప్రకటించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెట్టుకొస్తుందని ప్రచారం జరుగుతుంది. తోట త్రిమూర్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కురసాల కన్నబాబు తిరిగి కాకినాడ రూరల్ సమన్వయకర్తగా వెళ్లిపోనున్నట్లు తెలుస్తోంది. 

ఒకవేళ తోట త్రిమూర్తులు రాకపోతే కురసాల కన్నబాబునే పార్లమెంట్ కు పంపే అవకాశాలు లేకపోలేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గత ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన చలమలశెట్టి సునీల్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఆయన సైకిలెక్కనున్నారని ప్రచారం.    

click me!