వైసీపీకి ఒక్క ఓటు వేసినా కేసీఆర్,మోదీకి వేసినట్లే : చంద్రబాబు

By Nagaraju penumalaFirst Published 23, Feb 2019, 10:28 AM IST
Highlights

రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఒక్క ఓటు కూడా వెయ్యనివ్వకుండా చూడాలంటూ నేతలకు సూచించారు. వైసీపీకి ఒక్క ఓటు పడినా అది కేసీఆర్‌కు, మోదీకి వేసినట్లేనని చెప్పుకొచ్చారు. మూడు పార్టీలు కలిసికట్టుగా మాట్లాడుతున్న అంశాలే అందుకు నిదర్శనం అన్నారు. మూడు పార్టీలు కలిసి ఏపీపై కుట్రలు పన్నుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. 

అమరావతి: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శల డోస్ పెంచారు సీఎం చంద్రబాబు నాయుడు. గత వారం రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తూర్పారబడుతున్నారు. 

తాజాగా శనివారం టీడీపీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఒక్క ఓటు కూడా వెయ్యనివ్వకుండా చూడాలంటూ నేతలకు సూచించారు. వైసీపీకి ఒక్క ఓటు పడినా అది కేసీఆర్‌కు, మోదీకి వేసినట్లేనని చెప్పుకొచ్చారు. 

మూడు పార్టీలు కలిసికట్టుగా మాట్లాడుతున్న అంశాలే అందుకు నిదర్శనం అన్నారు. మూడు పార్టీలు కలిసి ఏపీపై కుట్రలు పన్నుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఆ పార్టీల కుమ్మక్కును ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత టీడీపీ నేతలదేనని చెప్పుకొచ్చారు. 

రాష్ట్ర భవిష్యత్తు కోసం విభేదాలు వీడాలని సూచించారు. ఇగోలు పక్కన పెట్టాలని పిలుపునిచ్చారు. చిరకాల ప్రత్యర్ధులు టీడీపీలో చేరుతున్నారంటే అది తెలుగుదేశం పార్టీ గొప్పతనమని అభివర్ణించారు. 

కడప జిల్లాలో అందుకు ఆదినారాయణరెడ్డి -రామసుబ్బారెడ్డి, కర్నూలు జిల్లాలో కోట్ల-కేఈ కుటుంబాలే అందుకు ఉదాహరణగా చెప్పుకొచ్చారు. ఈనెల 28న ఢిల్లీలో ఎన్డీయేతర పార్టీల సమావేశం ఉందని, ఆ సమావేశంలో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.  
 

ఈ వార్తలు కూడా చదవండి

మహానాయకుడులో బాలయ్య అదే చూపించారు: చంద్రబాబు వ్యాఖ్యలు

Last Updated 23, Feb 2019, 10:34 AM IST