మహానాయకుడులో బాలయ్య అదే చూపించారు: చంద్రబాబు వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published Feb 23, 2019, 10:16 AM IST
Highlights

అలాగే నేడు కూడా తిప్పికొట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాకే తెలుగు వాడి ఉనికి ప్రపంచానికి తెలిసిందన్నారు. మళ్లీ టీడీపీ రావడం చారిత్రిక అవసరమని బాబు చెప్పుకొచ్చారు. 
 

అమరావతి: ప్రధాని నరేంద్రమోదీ ఏపీ పర్యటనపై సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ఇచ్చి హామీలు నెరవేర్చిన తర్వాతే ఏపీలో మోదీ కాలుపెట్టాలని హెచ్చరించారు. శనివారం టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ప్రధాని మాయమాటలు చెప్తానంటే కుదరదన్నారు. 

ఢిల్లీలోనే కూర్చుని మాయమాటలు చెప్పుకోవాలని ఏపీలో వచ్చి మరోసారి మోసం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని తేల్చి చెప్పారు. ఆనాడు ఢిల్లీ కుట్రలను దివంగత సీఎం ఎన్టీఆర్ ఎలా తిప్పికొట్టారో మహానాయకుడు సినిమాలో బాలయ్య అద్భుతంగా చూపించారని తెలిపారు. 

అలాగే నేడు కూడా తిప్పికొట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాకే తెలుగు వాడి ఉనికి ప్రపంచానికి తెలిసిందన్నారు. మళ్లీ టీడీపీ రావడం చారిత్రిక అవసరమని బాబు చెప్పుకొచ్చారు. 

ఈ సందర్భంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. ఈ ఏడాది 6 నెలల పాటు వరుస ఎన్నికలు ఉంటాయని చెప్పారు. నిత్యం ప్రజాల్లోనే ఉండాలని నేతలకు సూచించారు. రాయలసీమకు నీళ్లివటంతో టీడీపీపై సానుకూలత పెరిగిందన్నారు. 

ఏపీకి ప్రత్యేక హోదా అనేది దేశం ఇచ్చిన హామీ అని రాహుల్ గాంధీ అన్న వ్యాఖ్యలను గుర్తు చేశారు. హోదా ఇస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారని తెలిపారు. అహం వీడాలని ఇగోలు పక్కన పెట్టాలని తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ పనిచెయ్యాలని చంద్రబాబు నాయుడు సూచించారు.  

click me!