ఢిల్లీలో విజయసాయిరెడ్డి బిజీబిజీ: ఏపీకి రావాలంటూ 15వ ఆర్థిక సంఘం చైర్మన్ కు ఆహ్వానం

Published : Aug 23, 2019, 09:00 PM IST
ఢిల్లీలో విజయసాయిరెడ్డి బిజీబిజీ: ఏపీకి రావాలంటూ 15వ ఆర్థిక సంఘం చైర్మన్ కు ఆహ్వానం

సారాంశం

ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రావాలంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాసిన ఆహ్వాన లేఖను ఎన్ కే సింగ్ కు అందజేశారు. సీఎం జగన్‌ ఆహ్వానంపై ఎన్‌కే సింగ్‌ సానుకూలంగా స్పందించారు ఎన్ కే సింగ్. ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వస్తానని హామీ ఇచ్చారు.   

న్యూఢిల్లీ: ఆంధప్రదేశ్ పర్యటనకు రావాలని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్ కే సింగ్ ను కోరారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి. శుక్రవారం ఢిల్లీలో 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ ఎన్‌కే సింగ్‌ను ఢిల్లీలో కలిశారు. ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు రావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆహ్వానించారు. 

ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రావాలంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాసిన ఆహ్వాన లేఖను ఎన్ కే సింగ్ కు అందజేశారు. సీఎం జగన్‌ ఆహ్వానంపై ఎన్‌కే సింగ్‌ సానుకూలంగా స్పందించారు ఎన్ కే సింగ్. ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వస్తానని హామీ ఇచ్చారు. 

అంతకు ముందు కేంద్ర ఆహారశుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి హరి సిమ్రత్ కౌర్ బాదల్ ను ఎంపీ విజయసాయిరెడ్డి కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఆహారశుద్ధి పరిశ్రమలు నెలకొల్పాలని వినతి పత్రం అందజేశారు. అలాగే జిల్లాలో పెద్ద ఎత్తున పండ్ల తోటలు ఉన్న నేపథ్యంలో ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని హరి సిమ్రత్‌ కౌర్‌కు విజ్ఞప్తి చేశారు.

మరోవైపు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి  నరేంద్రసింగ్ తోమార్‌తోనూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు విజయసాయిరెడ్డి. అనంతపురం జిల్లాకు పశుగ్రాసం పంపాలని కోరారు. జిల్లాలో వర్షాలు లేక  తీవ్ర కరువు ఏర్పడిందని, పశువులను కబేళాలకు తరలించాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం సత్వరమే స్పందించి జిల్లాకు రెండు నెలలకు సరిపడ పశుగ్రాసం పంపించాలని తోమార్‌ను కోరినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?