వైఎస్సార్ వర్థంతి...కుటుంబంతో కలిసి నివాళి అర్పించిన జగన్

By Arun Kumar PFirst Published Sep 2, 2020, 11:47 AM IST
Highlights

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతిని పురష్కరించుకుని బుధవారం ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద వైఎస్ కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. 

కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతిని పురష్కరించుకుని బుధవారం ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద వైఎస్ కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతితో పాటు ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు. అంతేకాకుండా టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, రవీంద్రనాథ్‌ రెడ్డి, అమర్‌నాథ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు.

తన తండ్రి  వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిన్న(మంగళవారం) సాయంత్రమే ఇడుపులపాయకు చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ లో అక్కడికి చేరుకున్న ఆయనకు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. మంగళవారం రాత్రి ఇడుపులపాయ ఎస్టేట్ గెస్ట్ హౌస్ లో బస చేసిన ఆయన ఇవాళ ఉదయం తన తండ్రి సమాధిని సందర్శించి నివాళి అర్పించారు.

read more  వైఎస్సార్ వర్ధంతి... ఇడుపులపాయకు చేరుకున్న సీఎం జగన్ (వీడియో)

మరోవైపు వైఎస్సార్ వర్థంతి సందర్భంగా విశాఖ పార్టీ కార్యాలయంలో ఆయన వర్థంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొని.. వైఎస్ రాజశేఖర్  రెడ్డిని స్మరించుకున్నారు.

సంక్షేమ పథకాలకు వైఎస్ఆర్ బ్రాండ్ అంబాసిడర్ లాంటివారంటూ మంత్రి అవంతి కొనియాడారు. ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని అన్నారు. తండ్రి బాటలో తనయుడు జగన్మోహన్ రెడ్డి నడుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కుటిల రాజకీయాలు చేసినా అభివృద్ధిని ఆపలేరని స్పష్టం చేశారు. రాజశేఖర్ రెడ్డి భౌతికంగా దూరమైనా రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. 
  
 

click me!