కరోనా నుండి కోలుకుని... శ్రీవారికి మొక్కు చెల్లించుకున్న అచ్చెన్నాయుడు

By Arun Kumar PFirst Published Sep 2, 2020, 11:17 AM IST
Highlights

 సమస్యల నుండి కాస్త ఊరట లభించడంతో టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తాజాగా కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమల: ఈఎస్ఐ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయి, ఆ తర్వాత కరోనా బారిన పడి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు టీడీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు. అయితే ఇటీవలే బెయిల్ లభించడం, ఆ వెంటనే కరోనా నుండి బయటపడి డిశ్చార్జీ అయ్యారు. ఇలా సమస్యలకు నుండి కాస్త ఊరట లభించడడంతో ఆయన తాజాగా కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కలియుగ దైవానికి తలనీలాలు సమర్పించుకుని మొక్కు చెల్లించుకున్నారు. 

మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి గత శుక్రవారం ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తమ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లిపోవద్దని కూడ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

ఈఎస్ఐ కుంభకోణంలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 70 రోజులుగా అచ్చెన్నాయుడు రిమాండ్ లో ఉన్నారు. నామినేషన్ పద్దతిలోనే మందుల కొనుగోలుకు అచ్చెన్నాయుడు లేఖ ఇచ్చారని... దీని ద్వారా రూ. 150 కోట్ల అవకతవకలు చోటు చేసుకొన్నాయని ఏసీబీ అధికారులు ప్రకటించారు. ఈ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశారు.

read more  డాక్టర్ సుధాకర్ కేసులో కుట్రకోణం: హైకోర్టులో సిబిఐ వాదన

 ఈ కేసులో అరెస్టైన ఓ వ్యక్తికి ఇటీవలనే ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు అచ్చెన్నాయుడికి ఇవాళ ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.ఈ ఏడాది జూన్ 12 వ తేదీన ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. 

అయితే ఆరోగ్య కారణాలతో  గుంటూరు జైల్లో ఉన్న అచ్చెన్నాయుడిని పోలీసులు రమేష్ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడికి కరోనా సోకడంతో కోర్టు అనుమతితో ఆయనను ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్సపొందిన ఆయన కరోనా నుంచి  కోలుకున్నారు. ఇటీవల ఆయనకు కరోనా నెగెటివ్ గా నిర్దారణ కావడంతో డిశ్చార్జీ అయ్యారు. 

click me!