ఆ యువతితో సహా హాజరుకావాలి: అనంతపురం ఎస్పీకి ఏపీ హైకోర్టు ఆదేశం

Published : Sep 02, 2020, 11:32 AM IST
ఆ యువతితో సహా హాజరుకావాలి: అనంతపురం ఎస్పీకి ఏపీ హైకోర్టు ఆదేశం

సారాంశం

అనంతపురం జిల్లా ఎస్పీని వ్యక్తిగతంగా హాజరుకావాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.

అనంతపురం: అనంతపురం జిల్లా ఎస్పీని వ్యక్తిగతంగా హాజరుకావాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.

తన భార్యను ఆమె తండ్రి అక్రమంగా నిర్భంధించారని ఆరోపిస్తూ అనంతపురం జిల్లా తాడిపత్రి మండలానికి చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి అనే యువకుడు ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ పై  జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం మంగళవారం నాడు విచారణ చేసింది.పిటిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రేమ వివాహం చేసుకొన్నాడని.... ప్రవీణ్ కుమార్ రెడ్డి భార్య ఆమె తల్లిదండ్రుల వద్ద ఉంటోందని  ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పారు. 

ఈ విషయమై యువతిని తీసుకొని గురువారంనాడు కోర్టుకు హాజరుకావాలని అనంతపురం ఎస్పీని హైకోర్టుకు హాజరుకావాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. యువతిని హైకోర్టుకు తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలను ప్రారంభించినట్టుగా సమాచారం.

ప్రేమ వివాహనికి పెద్దలు అంగీకరించని కారణంగానే ఈ పరిస్థితులు చోటు చేసుకొన్నాయా.. లేదా ఇతరత్రా మరేమైనా కారణాలు ఉన్నాయా అనేది తేలాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు