నంద్యాల వైసిపి అభ్యర్థి గంగుల ప్రతాపరెడ్డి: రేపే ప్రకటన

First Published May 17, 2017, 5:03 PM IST
Highlights

గత నెలరోజులుగా ఎండ వేడికి తోడు రాబోయే ఉప ఎన్నికల అభ్యర్థి ఎవరన్న విషయం మరింత వేడి పుట్టిస్తున్నది నంద్యాల ప్రాంతంలో.  తెదేపా లో అభ్యర్థి ఎవరో తేలడం లేదు.   భూమా,శిల్పాల మధ్య అభ్యర్తిత్వం దోబూచులాడుతూ ఉంది..ఈ లోగా భూమా వర్గీయులు నంద్యాల లోని ప్రతి సెంటర్ లో హోర్డింగ్స్ పెట్టి టికెట్ మాదే నని జెండా పాతేశారు.ఇక వైకాపా మాత్రం ఈ ఉత్కంఠకు తెరదించారు...ఎన్నికల యుద్ధానికి తెరతీశారు..వారి అభ్యర్థిగా గంగుల ప్రతాప్‌రెడ్డిని రేపు ప్రకటించబోతున్నారు...ఈలోగా ప్రతాప్‌రెడ్డితో ఎషియా నెట్ జరిపిన మాటామంతి  ఇది...

మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపి కూడా గంగుల ప్రతాప రెడ్డితో ఇంటర్వ్యూ

 

ఏషియా నెట్ : ఆ మధ్య పత్రికల వారితో మాట్లాడుతూ "సరైన వ్యక్తి సరైన సమయం లో ఆహ్వానిస్తే ఎన్నికల్లో నిలబడతా అన్నారు..పిలిచారా?

 

గంగుల- అవును జగన్ ఫోన్ చేసి నాన్న గారి సమకాలీనులైన మీ దీవెనలు కావాలి,మాతో కలిసి ప్రయాణించి మార్గదర్శకత్వం వహిస్తారా అని అడిగాడు

 

ఏషియానెట్ : కొత్త పార్టీ,కొత్త నాయకత్వం కదా, ఇబ్బందేమి ఉండదా?

 

గంగల : కొత్తేముంది? నేను రాజా (రాజశేఖర్‌రెడ్డిని అలాగే పిలిచేవాడు)ఒకే సమయంలో రాజకీయాల్లోకి వచ్చాము శాసనసభ,పార్లమెంట్ లోనూ కలిసే ఉన్నాము..ఇక కొత్తేముంది? జగన్ మా కళ్ల ముందు పెరిగినవాడే....ఇక చిన్నవాడైనా అతని ఆలోచనా సరళి,ప్రజలకు సేవచేయాలనే గుణాలు నచ్చాయి..దీనికి నా అనుభవం కూడా తోడవ్వబోతుంది...ఇక ప్రజా సమస్యలపై స్పందించే గుణం తండ్రి నుంచి అబ్బింది..మాయమాటలు చెప్పి చెయ్యనిది చేసినట్టు చెప్పుకునే బాబు నైజం కాదు.

.

ఏషియా నెట్ :మరి 2004 లో రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గ సభ్యుడు కాలేకపోయారు మీ స్పందన ఏమిటి?

 

గంగుల : అర్ధరాత్రి వరకు నేను మంత్రిని కాబోతున్నా అనుకున్నా..ఆ తర్వాత సమీకరణలు మారాయి..అయినా ఈ విషయంగా నేనెప్పుడూ రాజా ను ప్రశ్నించలేదు.నా నియోజకవర్గ అభివృద్దికి కావలసినంత స్వేచ్చ ఇచ్చారు.

 

ఏషియా నెట్ : మధ్యలో మీరెక్కడో ప్రజలకు దూరం అయ్యారు అనే భావన ప్రజల్లో ఉంది.

 

గంగుల - నిజమే మీకు అలా అనిపించి ఉండొచ్చు.ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చి జనానికి నాణేనికి మరో వైపు తెలుస్తుంది కానీ ఎన్నో ప్రజాసమస్యలపై నేను మాట్లాడింది పత్రికల్లోని జిల్ల ఎడిషన్లలో నియోజకవర్గం పేజీకి పరిమితం చేసి రాస్తే ఏం చెయ్యగలం?2000-01 ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర పోలవరం కంటే మొదలు పెట్టి పూర్తి చేసుండగలిగే చిన్న ప్రాజెక్టుల గురించి అక్కడ తిగిగి అధ్యయనం చేసి సలహాలిచ్చాను...ఇక ఏ ప్రాంతానికవసరమైన ఎత్తిపోతల పధకాలు పూర్తి చేసుకుని వివాదాలు లేకుండా రాష్ట్ర విభజన చేసుకుందామన్న నా ప్రతిపాదనలను పట్టించుకుందెవరు?.

 

ఏషియా నెట్ :ఇపుడు మళ్లీ రాయలసీమ నీళ్ల సమస్య వచ్చింది. ఈ విషయాన్ని మీరెలా చూస్తారు?

గంగుల - అప్పట్లో తెలుగుగంగ పేరుతో కృష్ణాజలాలు కుందు నదిలోకి,ఆతర్వాత పెన్నాలోకి పారించి సోమశిల,కండలేరు ద్వారా చెన్నై కి తీసుకుపోవాలనుకున్నప్పుడు నిరసన తెలిపి కర్నూల్,కడప జిల్లా సాగునీటిగా తెప్పించించటానికి ఉద్యమించిన వారిలో ఒకడిని.అంతేకాకుండా ఆ నీళ్లతో కొన్ని చిన్నాపెద్దా చెరువులను నింపుకోవడానికి అనుమతులు తెచ్చింది నేనే.ఇక నీటి సమస్యల గురించి మాట్లాడేప్పుడు రాయలసీమ 4 జిల్లాలతో పాటూ ప్రకాశం,నెల్లూరు సమస్యలూ  మాట్లాడుతాను..కారణం పెన్నా బేసిన్ కాబట్టి"... 

ఏషియా నెట్ : నంద్యాల అసెంబ్లీ కి రావడం కొత్త అనిపించడంలేదా?ఇక్కడ కొత్తతరం వచ్చేసింది కదా

గంగుల- ఎంత మాత్రం కాదు మొత్తం నంద్యాల పార్లమెంట్ లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల వారితో సత్సంబంధాలున్నాయి...ఇక ఇదివరకు ఆళ్లగడ్డ నియోజకవర్గం లో మాకు కంచుకోట లాంటి గోసుపాడు మండలం ఆ తర్వాత నంద్యాల్లో చేరిందే కదా!ఇక కొత్తతరం పిల్లలైనా వారి పెద్దలద్వారా నా గురించి వినే ఉంటారు...ఆ పెద్దలు కొత్తతరానికి నన్ను పరిచయం చేస్తారు.ఇక పార్లమెంట్ సభ్యుడిగా వచ్చే ఎన్నికల్లో నిలబడటానికి ఈ సెప్టెంబర్ నుంచి మరింత క్రియాశీలకం కావాలనుకున్నా మిత్రులు,శ్రేయోభిలాషులు..అంతకు మించి జగన్ అసెంబ్లీకి నిలబడమని అడిగినందున కొన్ని నెలల ముందు రావాల్సివస్తోంది"అన్నారు...

ఏషియా నెట్ :నంద్యాల ప్రజలకు మీ సేవలెలా ఉంటాయి.

గంగుల - 1991 పార్లమెంట్ ఎన్నికల సమయంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం తెస్తామని చెప్పాను..ఇప్పుడది రజతోత్సవం జరుపుకోబోతోంది...నంద్యాల నీటి సమస్య తీర్చాలని వెలుగోడు రిజర్వాయర్ నుంచి 0.3 టీయంసీ నీళ్లు తీసుకోవడానికి అనుమతి తెచ్చాను...గుంటూరు-గుంతకల్లు బ్రాడ్గేజ్ పనులు రెండున్నరేళ్లలో పూర్తయ్యేలా చేసాను(నిజానికి అది 5 ఏళ్ల కాలపరిమితి)...ఇక చిత్తూరు-కర్నూలు మార్గాన్ని హైవేగా చేయించాను...ఇక పవర్ గ్రిడ్ ఏర్పాటుకు నా కృషే కారణం....ఇక ఒకానొక దశలో శ్రీశైలం కుడి కాలువ పనులకు ప్రపంచ బ్యాంక్ రుణం ఇవ్వమన్నారు..కారణం వాటికి k.c.canal ఆధునికీకరణ వల్ల మిగిలే 9 టీయంసీలు వాడుకుంటారు..అది జరగనందున రుణం ఇవ్వమంటారు,అప్పుడు ప్రధానిని కలిసి ఆ సమస్య తీరేట్లు చేసాను.

 

ఇక రాబోయే ఎన్నికల్లో విజయం గురించి ధీమా వ్యక్తం చేస్తూ మా దగ్గర నోట్ల మూటలు ఉండకపోవచ్చు కానీ మా మంచి,మర్యాద,మన్నన..ఆప్యాయతలే గెలిపిస్తాయి అని సెలవు తీసుకున్నారు.

 

(ఇంటర్వ్యూ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి)

click me!