వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: తెలంగాణ హైకోర్టులో సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్

By narsimha lode  |  First Published Feb 13, 2023, 5:11 PM IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి  హత్య  కేసులో  నిందితుడు సునీల్  యాదవ్  తెలంగాణ హైకోర్టులో  బెయిల్  పిటిషన్ దాఖలు  చేశారు.  


హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో  నిందితుడు సునీల్  యాదవ్   తెలంగాణ హైకోర్టులో  సోమవారం నాడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.   ఈ పిటిషన్ పై  ఈ నెల  16వ తేదీన  తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహించనుంది. 

వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసును హైద్రాబాద్ లోని  ప్రిన్సిపల్ సీబీఐ కోర్టు విచారిస్తుంది.  ఈ నెల  10వ తేదీన  తొలిసారిగా  ఈ కేసు హైద్రాబాద్ ప్రిన్సిపల్  సీబీఐ కోర్టు విచారించిన విషయం తెలిసిందే. గతంలో  నిందితులంతా  కడప జైలులో ఉండేవారు. అయితే ఈ కేసును  హైద్రాబాద్  సీబీఐ కోర్టు విచారిస్తున్నందున  నిందితులను  హైద్రాబాద్ చంచల్ గూడ జైలుకు తరలించారు.   దీంతో  బెయిల్  కోసం   సునీల్  యాదవ్  ఇవాళ తెలంగాణ హైకోర్టులో  బెయిల్ పిటిషన్ దాఖలు  చేశారు. 

Latest Videos

2019 మార్చి  19వ తేదీన  పులివెందులలోని తన నివాసంలో  వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు.  ఈ కేసును  సీబీఐ విచారిస్తుంది. ఈ కేసులో  కొందరు సాక్షులను  అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.  దీంతో  ఈ కేసును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా  ఇతర రాష్ట్రంలో  విచారణ చేయాలని  వైఎస్ వివేకానందరెడ్డి  కూతురు వైఎస్ :సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు  చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు  తెలంగాణలో  ఈ కేసు విచారణ నిర్వహించనున్నట్టుగా  ప్రకటించింది. 

also read:వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: విచారణ మార్చి 10కి వాయిదా

ఈ కేసులో  ఇప్పటికే  ఐదుగురిని  సీబీఐ అధికారులు అరెస్ట్  చేశారు.  సీబీఐ అరెస్ట్  చేసిన వారిలో  సునీల్ యాదవ్  ఒకరు.  సునీల్ యాదవ్   బెయిల్ కోసం  తెలంగాణ హైకోర్టులో  పిటిషన్ దాఖలు  చేశారు. 

ఈ కేసులో  అరెస్టైన  దస్తగిరి  సీబీఐకి అఫ్రూవర్ గా మారాడు.  దస్తగిరి సీబీఐకి  వాంగ్మూలం ఇచ్చాడు.ఈ వాంగ్మూలాన్ని  సీబీఐ అధికారులు గతంలోనే  జమ్మలమడుగు కోర్టుకు సమర్పించారు.  ఈ కేసులో  దస్తగిరి , ఎర్ర గంగిరెడ్డిలు బెయిల్ పై  బయట ఉన్నారు.  ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో  సీబీఐ పిటిషన్ దాఖలు  చేసింది.

click me!