తనకు ప్రాణ హాని ఉందని వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐకి అఫ్రూవర్ గా మారిన దస్తగిరి కడప ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. సమాచారం ఇవ్వకుండానే గన్ మెన్లను మార్చారన్నారు.ఈ విషయమై సీబీఐ అధికారులకు కూడ ఈ విషయమై రాతపూర్వకంగా ఫిర్యాదు అందించారు.
కడప: తనకుప్రాణ హాని ఉందని వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐకి అఫ్రూవర్ గా మారిన దస్తగిరి కడప ఎస్పీకి, సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. సోమవారం నాడు ఈ విషయమై కడప ఎస్పీకి, సీబీఐ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టుగా చెప్పారు.
సోమవారం నాడు కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు సమాచారం ఇవ్వకుండానే గన్ మెన్లను మార్చారన్నారు. కొత్తగా వచ్చిన గన్ మెన్లు తన రక్షణ గురించి సరిగా పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. గన్ మెన్ల మార్పు విషయమై పులివెందుల డీఎస్పీని అడిగితే తనకు తెలియదన్నారు. గన్ మెన్ల కేటాయింపు ఏఆర్ పోలీసులు చూస్తారన్నారు. ఏఆర్ పోలీసులను ప్రశ్నిస్తే పొంతనలేదని సమాధానాలు చెప్పారన్నారు. విజయవాడ నుండి వచ్చిన ఆదేశాల మేరకు గన్ మెన్లను మార్చినట్టుగా దస్తగిరి మీడియాకు చెప్పారు. అంతేకాకుండా పులివెందుల నియోజకవర్గంలోని వైసీపీ నేతలు తనపై అక్రమంగా కేసులు పెడుతున్నారన్నారు. తనకు అనుకూలంగా ఉండే గన్ మెన్లను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. తనకు ఏమైనా జరిగితే సీఎం జగన్ బాధ్యత వహించాలన్నారు రాష్ట్ర ప్రజల రక్షణ కల్పించాల్సిన బాధ్యత సీఎంపై ఉంటుందనన్నారు.
undefined
also read:వైఎస్ వివేకా హత్య: దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమా శంకర్ రెడ్డి పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీం
2019 మార్చి 19వ తేదీన వైఎస్ వివేకానందరెడ్డిని ఇంట్లోనే దుండగులు హత్యచేశారు.ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి సీబీఐకి అఫ్రూవర్ గా మారాడు. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సీబీఐ అధికారులు ఈ కేసును విచారిస్తున్నారు. బెంగుళూరులో చేసిన ల్యాండ్ సెటిల్ మెంట్ డబ్బుల వాటా విషయంలో వివేకానందరెడ్డికి ఎర్ర గంగిరెడ్డికి మధ్య విబేధాలు రావడంతోనే ఈ హత్య జరిగిందని దస్తగిరి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు.ఈ వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు కోర్టులో సమర్పించారు.
ఈ కేసులో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఎర్ర గంగిరెడ్డి తదితరులను సీబీఐ అరెస్ట్ చేసింది. వీరిలో కొందరికి బెయిల్ దక్కింది. ఈ కేసులో సాక్షులుగా ఉన్న ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ విషయమై వైఎస్ సునీతా రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ కేసును విచారించాలని సుప్రీంకోర్టులో వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతా రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఏడాది ఆగస్టు 12న సుప్రీంకోర్టు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 19న సుప్రీంకోర్టు విచారించింది. ఈ విషయమై సీబీఐకి, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
దస్తగిరి సీబీఐకి అప్రూవర్ గా మారడాన్ని సవాల్ చేస్తూ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఇవాళ డిస్మిస్ చేసింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈ ఏడాది సెప్టెంబర్ 26న తిరస్కరించింది