బుర్రుంటే విశాఖ అభివృద్దిని ఎందుకు వద్దంటున్నారు: అచ్చెన్నాయుడికి బొత్సకౌంటర్

By narsimha lode  |  First Published Oct 10, 2022, 7:18 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక  కాలం పాటు పాలించిన టీడీపీ రాష్ట్రాన్ని ఎందుకు అభివృద్ది చేయలేదో చెప్పాలని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. 


విశాఖపట్టణం:విశాఖపట్టణాన్ని రాజధాని చేస్తే మీకొచ్చిన నష్టం ఏమిటో చెప్పాలని  ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ నేతలను ప్రశ్నించారు. పదవులైతే కావాలి కానీ, ఉత్తరాంధ్ర అభివృద్ది అవసరం లేదా అని  మంత్రి బొత్స సత్యనారాయణ  టీడీపీ ఏపీ అధ్యక్షుడు  అచ్చెన్నాయుడును కోరారు. 

సోమవారంనాడు విశాఖపట్టణంలో  మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు  తనపై చేసిన విమర్శలను ఆయన ప్రస్తావించారు. తనకు బుర్రలేదని  అచ్చెన్నాయుడు చేసిన విమర్శలను ఆయన ప్రస్తావించారు. బుర్ర ఉన్న అచ్చెన్నాయుడు అభివృద్దిని ఎందుకు వద్దంటున్నాడో చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 

Latest Videos

undefined

రాష్ట్రంలో  ఎక్కువ కాలం పాటు అధికారంలో టీడీపీ ఉందన్నారు. రాష్ట్రాభివృద్ది ఎందుకు చేయలేదని మంత్రి  అచ్చెన్నాయుడును ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర కోసం ఏం  చేశారని అచ్చెన్నాయుడిని మంత్రి  బొత్స  సత్యనారాయణ ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే విశాఖపట్టణం అభివృద్ది చెందిందని బొత్స సత్యనారాయణ చెప్పారు. విశాఖలో చంద్రబాబు ఒక్క ఆసుపత్రిని కూడ కట్టించలేదన్నారు. విశాఖ అభివృద్దిని అచ్చెన్నాయుడు ఎందుకు వద్దంటున్నారని మంత్రి ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు ఇష్టానుసారం మాట్లాడొద్దని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు.  టీడీపీ నేతలు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు. ప్రజలను మభ్య పెట్టేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తుందని బొత్స సత్యనారాయణ విమర్శించారు. 

బీజేపీకి ఏపీలో మనుగడ లేదని ఆయన చెప్పారు. ముందస్తు  ఎన్నికలు ఊహజనితమేనన్నారు. చేతకాని వాళ్లే ముందస్తుకు వెళ్తారని ఆయన విమర్శించారు. తమది దమ్మున్న ప్రభుత్వమన్నారు. అమరావతి దోపీడీ అన్నప్పుడు  పవన్ కళ్యాణ్ ను అవగాహన లేదా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విశాఖ భూములపై సిట్ నివేదికను త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి చెప్పారు. 

వికేంద్రీకరణే  వైఎస్ఆర్‌సీపీ విధానమని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. ఈ నెల 15న విశాఖ గర్జనను విజయవంతం చేయాలని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స  సత్యనారాయణ కోరారు.ఈనెల 12న అన్నివార్డుల్లో  మానవహారాలను నిర్వహించనున్నట్టుగా ఆయన చెప్పారు. 

అమరావతి నుండి అరసవెల్లికి అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారు. దీనికి కౌంటర్ గా వైసీపీ ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా జేఎసీలు ఏర్పాటయ్యాయి. మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పాటైన జేఎసీ కి  వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామాను సమర్పించారు. స్పీకర్ ఫార్మెట్ లోనే  రాజీనామా పత్రాన్ని అందించారు. 
 

click me!