వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్: విచారణ ఈ నెల 27కి వాయిదా

By narsimha lode  |  First Published Feb 16, 2023, 1:45 PM IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసు నిందితుడు  సునీల్ యాదవ్  కి  బెయిల్ ఇవ్వవద్దని  వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి  తెలంగాణ హైకోర్టులో  పిటిషన్ దాఖలు  చేశారు.  దీంతో  సునీల్ యాదవ్  బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 27కి వాయిదా వేసింది.



హైదరాబాద్:  మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసు నిందితుడు  సునీల్ యాదవ్  దాఖలు  చేసిన  బెయిల్ పిటిషన్ పై    విచారణను  ఈ నెల  27వ తేదీకి  వాయిదా వేసింది   తెలంగాణ హైకోర్టు.  తనకు బెయిల్ మంజూరు చేయాలని   సునీల్ యాదవ్   తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు  చేశారు.  ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ నిర్వహించింది.  

మరో వైపు  సునీల్ యాదవ్ కి  బెయిల్ ఇవ్వవద్దని  వైఎస్ వివేకానందరెడ్డి  భార్య  తెలంగాణ హైకోర్టులో  పిటిషన్ దాఖలు  చేసింది. ఈ కేసు విచారణ సాగుతున్న తరుణంలో   సునీల్ యాదవ్   కి  బెయిల్ ఇవ్వవద్దని  వివేకానందరెడ్డి భార్య  ఆ పిటిషన్ లో కోరారు.   సునీల్ యాదవ్ కు   బెయిల్ మంజూరు చేస్తే   సాక్షులను ప్రభావితం  చేసే అవకాశం ఉందని  వివేకా సతీమణి అభిప్రాయపడ్డారు. దీంో  సునీల్  యాదవ్  బెయిల్ పిటిషన్  పై విచారణను   ఈ నెల  27వ తేదీకి  వాయిదా వేసింది  తెలంగాణ హైకోర్టు.

Latest Videos

undefined

ఈ నెల  13వ తేదీన  తెలంగాణ హైకోర్టులో  సునీల్ యాదవ్  బెయిల్  పిటిషన్  దాఖలు  చేశారు. ఈ బెయిల్ పిటిషన్ పై  ఇవాళ తెలంగాణ హైకోర్టు  విచారణ  నిర్వహించింది.  వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసును తెలంగాణలోని  ప్రిన్సిపల్ సీబీఐ కోర్టు  విచారిస్తుంది.

also read:వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: తెలంగాణ హైకోర్టులో సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్

 గతంలో  ఈ కేసును ఏపీ రాష్ట్రంలోని కోర్టు   విచారణ  నిర్వహించింది. ఏపీ రాష్ట్రంలో  కాకుండా   ఇతర రాష్ట్రాల్లో విచారణ  నిర్వహించాలని     వైఎస్ వివేకానందరెడ్డి  కూతురు సునీతా రెడ్డి  పిటిషన్ దాఖలుచేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన  సుప్రీంకోర్టు    కీలక ఆదేశాలు జారీ చేసింది.  తెలంగాణ రాష్ట్రంలోని ప్రిన్సిపల్ సీబీఐ  కోర్టుకు  కేసు విచారణను బదిలీ చేసింది.   దీంతో  సునీల్ యాదవ్ తెలంగాణ హైకోర్టులో  బెయిల్ పిటిషన్ దాఖలు  చేశారు. ఈ కేసు నిందితులను   కూడా  కడప నుండి హైద్రాబాద్ చంచల్ గూడ జైలుకు  తరలించారు.

click me!