బద్వేల్ లో టెన్షన్: దళితులకు చంద్రబాబు క్షమాపణకై ఎమ్మెల్యే సుధ నిరసన

Published : Apr 19, 2023, 03:01 PM IST
బద్వేల్ లో  టెన్షన్: దళితులకు చంద్రబాబు క్షమాపణకై  ఎమ్మెల్యే సుధ  నిరసన

సారాంశం

కడప జిల్లాలోని బద్వేల్  లో  ఎమ్మెల్యే  దాసరి సుధ  నిరసనకు దిగారుచంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకుంటామని  ప్రకటించారు.  రోడ్డుపై  బైఠాయించిన  నిరసనను కొనసాగిస్తున్నారు.  దీంతో  టెన్షన్ నెలకొంది.  


కడప: జిల్లాలోని బద్వేల్  నాలుగు రోడ్ల కూడలిలో   వైసీపీ  ఎమ్మెల్యే   దాసరి సుధ  బుధవారంనాడు  ఆందోళనకు దిగారు.  దళితులపై  అనుచిత వ్యాఖ్యలు  చేసినందుకు  గాను  చంద్రబాబు, లోకేష్  భేషరతుగా  క్షమాపణలు  చెప్పాలని  ఎమ్మెల్యే డిమాండ్  చేస్తున్నారు. 

బద్వేల్  నాలుగు రోడ్ల కూడలిలో  ఎమ్మెల్యే సుధ బైఠాయించారు.  నల్ల బ్యాడ్జీలు , నల్ల జెండాలతో  చంద్రబాబు కాన్వాయ్ వెళ్లే మార్గంలో  ఎమ్మెల్యే   నిరసనకు దిగారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ  నల్ల జెండాలతో  దళిత  నేతల  నిరసనకు దిగారు. దళితులకు క్షమాపణ చెప్పిన తర్వాతే చంద్రబాబు బద్వేల్ కు రావాలని  ఎమ్మెల్యే డిమాండ్  చేశారు.

బద్వేల్  లో  పార్టీ  సమావేశానికి ఇవాళ  చంద్రబాబు  హాజరు కానున్నారు.  చంద్రబాబు  కాన్వాయ్ ను అడ్డుకుంటామని వైసీపీ నేతలు ప్రకటించార. నిన్న కూడా చంద్రబాబు  పర్యటనలో  వైసీపీ  కార్యకర్తలు  ఈ విషయమై  ప్రశ్నించే  ప్రయత్నం చేశారు. ఇవాళ  ఎమ్మెల్యే  నేతృత్వంలో   వైసీపీ  శ్రేణులు  రోడ్డుపై బైఠాయించి  నిరసనకు దిగారు. 

PREV
click me!

Recommended Stories

Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?
IMD Rain Alert : ఈ రెండ్రోజులు వర్ష బీభత్సమే... ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం