YS Vivekananda Reddy Murder Case: సీబీఐ అధికారిపై కడప పోలీసుల కేసు.. తదుపరి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు

Published : Feb 23, 2022, 04:43 PM ISTUpdated : Feb 23, 2022, 04:53 PM IST
YS Vivekananda Reddy Murder Case: సీబీఐ అధికారిపై కడప పోలీసుల కేసు.. తదుపరి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసును (YS Viveka Reddy Murder Case) దర్యాప్తు చేస్తున్న CBI Additional SP రామ్ సింగ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. రామ్‌ సింగ్‌పై పోలీసులు నమోదు చేసిన కేసులో హైకోర్టు స్టే ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసును (YS Viveka Reddy Murder Case) దర్యాప్తు చేస్తున్న CBI Additional SP రామ్ సింగ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. రామ్‌ సింగ్‌పై పోలీసులు నమోదు చేసిన కేసులో హైకోర్టు స్టే ఇచ్చింది. ఇక, వివేకానందరెడ్డి హత్య కేసును విచారణ జరుపుతున్న రామ్ సింగ్‌పై కడపలోని రిమ్స్ పోలీస్ స్టేషన్‌లో  కేసు నమోదైంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ పేరుతో తనను  సీబీఐ అధికారులు వేధిస్తున్నారని, తప్పుడు సాక్ష్యం చెప్పాలని బెదిరిస్తున్నారని పులివెందుల బాకరాపురానికి చెందిన Uday Kumar Reddy ఫిర్యాదు చేశారు.  ఇటీవల జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఆర్‌ అదనపు ఎస్పీ Mahesh Kumar ను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.  

ఈ కేసుకు సంబంధించి తనకు తెలిసిన విషయాలన్నీ చెప్పినా సీబీఐ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ క్రమంలోనే కడప రిమ్స్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీలోని 195ఏ, 323, 506, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. స్థానిక కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్టుగా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. 

అయితే దీనిని రామ్ సింగ్ హైకోర్టులో సవాలు చేశారు. తనపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ిన సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. కేసు విచారణలో తదుపరి చర్యలు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అధికారిపై ఎటువంటి చర్యలు చేపట్టవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

‘నాకు తెలియని విషయంలో స్టేట్‌మెంట్ ఇవ్వలేనని రామ్ సింగ్‌కి పదే పదే చెబుతున్నాను. అందుకు నిరాకరించినందుకు నా కుటుంబ సభ్యులను ఈ కేసులో ఇరికిస్తానని రామ్ సింగ్ బెదిరించాడు. వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పటి నుంచి సీబీఐ తనను 22 సార్లు ప్రశ్నించింది. ఆరు నుంచి ఏడు సార్లు నోటీసులు ఇచ్చారు. కొన్నిసార్లు వాట్సాప్ ద్వారా కాల్ చేశారు. ఫిబ్రవరి 14న అడిషనల్ ఎస్పీ, ఐదుగురు కానిస్టేబుళ్లతో కలిసి నా ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించారని, సీబీఐ సిబ్బంది నాపై దాడి చేశారు’ అని ఉదయ్ కుమార్ రెడ్డి చెప్పారు. 

‘నా తల్లి నన్ను రక్షించడానికి ప్రయత్నించినప్పుడు.. అదనపు ఎస్పీ నా తల్లిదండ్రులను దుర్భాషలాడాటమే కాకుండా భయపెట్టాడు. నా కుటుంబ సభ్యులందరిపై కేసు నమోదు చేసి మమ్మల్ని జైలుకు పంపిస్తానని కూడా బెదిరించాడు’ అని ఉదయ్ కుమార్ పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నారు. సీబీఐ చర్యల వల్ల స్థానికంగా తమ గౌరవం పోయిందని చెప్పారు. రామ్ సింగ్, ఇతర సీబీఐ సిబ్బందపై చర్యలు తీసుకోకపోతే.. తమకు ప్రాణాలు తీసుకోవడం తప్ప వేరే మార్గం లేదని అన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్