వివేకా హత్య కేసు: ఫోన్ కాల్స్‌పై సిట్ ఆరా

By narsimha lodeFirst Published Aug 30, 2019, 12:34 PM IST
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సెల్‌పోన్ డేటా సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

కడప:మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ వేగవంతం చేసింది సిట్.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ సిట్ ఈ కేసు విచారణను వేగవంతం చేసింది.

ఈ ఏడాది మార్చి 14వ తేదీన వైఎస్ వివేకానందరెడ్డి తన ఇంట్లోనే హత్యకు గురయ్యాడు.ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, వాచ్‌మెన్ రంగయ్యలకు నార్కో అనాలిసిస్ టెస్ట్ చేశారు. వివేకానందరెడ్డి హత్యకు గురైన రోజు పులివెందుల నుండి ఎక్కడెక్కడికి ఫోన్లు వెళ్లాయనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఎవరెవరు ఎవరితో ఫోన్లలో మాట్లాడారనే విషయమై ఆరా తీస్తున్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు నిందితులు ఎవరనే విషయమై త్వరలోనే తేల్చేందుకు సిట్ ప్రయత్నిస్తోంది.
 

సంబంధిత వార్తలు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య: పరమేశ్వర్ రెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్‌

 

click me!