వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్: బిటెక్ రవి అనుచరుడి పాత్ర?

By telugu teamFirst Published Mar 19, 2019, 1:47 PM IST
Highlights

సిట్ అధికారులు రౌడీ షీటర్ దిద్దుకుంట శేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ వివేకా హత్య సంఘటనలో అతని పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దిద్దుకుంట శేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నేత బిటెక్ రవికి సన్నిహతుడని సమాచారం.

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పలు మలుపులు తీసుకుంటోంది. తాజాగా, సిట్ అధికారులు రౌడీ షీటర్ దిద్దుకుంట శేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ వివేకా హత్య సంఘటనలో అతని పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. 

దిద్దుకుంట శేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నేత బిటెక్ రవికి సన్నిహతుడని సమాచారం. దిద్దుకుంట శేఖర్ రెడ్డి వివేకా సన్నిహిత అనుచరుడు పరమేశ్వర్ రెడ్డితో కుమ్మక్కయినట్లు చెబుతున్నారు. 

పరమేశ్వర్ రెడ్డిని సిట్ అధికారులు ఆస్పత్రిలో ఉండగా అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పరమేశ్వర్ రెడ్డి, వివేకా మరో అనుచరుడు గంగిరెడ్డితో కలిసి పక్కా ప్రణాళిక వ్యవహరించినట్లు అనుమానిస్తున్నారు.

వివేకా హత్యకు 15 రోజుల ముందు రెక్కీ నిర్వహించినట్లు కూడా చెబుతున్నారు. వివేకా పెంపుడు కుక్క కూడా అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల వ్యవహారాలు వివేకా హత్యకు కారణమై ఉండవచ్చునని అంటున్నారు. 

వివేకా హత్య కేసును నిష్పాక్షికంగా విచారించాలని బిటెక్ రవి డిమాండ్ చేశారు. హత్యతో సంబంధం లేనివారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. వైఎస్ జగన్ ప్రధాన అనుచరుడు దేవిరెడ్డి శంకర్ ను ఎందుకు అదుపులోకి తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. 

click me!