వైఎస్ వివేకా హత్య కేసుపై హైకోర్టులో పిటిషన్‌

By Siva KodatiFirst Published Mar 19, 2019, 1:38 PM IST
Highlights

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వివేకా హత్యపై విచారణ జరిపించాల్సిందిగా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్ హైకోర్టును ఆశ్రయించారు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వివేకా హత్యపై విచారణ జరిపించాల్సిందిగా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్ హైకోర్టును ఆశ్రయించారు.

తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై తమకు నమ్మకం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. సీబీఐతో దర్యాప్తు జరిపి దోషులను పట్టుకుని వారిని కఠినంగా శిక్షించాలని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. మంగళవారం విచారించనుంది. మరోవైపు ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న వివేకానందరెడ్డి ప్రధాన అనుచరుడు పరమేశ్వరరెడ్డిని పోలీసులు తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన నాటి నుంచి ఆయన పులివెందుల నుంచి అదృశ్యమయ్యారు. 

click me!