వివేకా హత్య కేసు.. అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు..

By Sumanth KanukulaFirst Published May 20, 2023, 11:43 AM IST
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. 

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని ఆదేశించింది. ఈ మేరకు వాట్సాప్ ద్వారా అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులు నోటీసులు పంపారు. ఇక, ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సీబీఐ అధికారులు పలుమార్లు అవినాష్ రెడ్డిని విచారించిన సంగతి తెలిసిందే. అయితే గత రెండు విచారణలకు అవినాష్ రెడ్డి దూరంగా ఉన్నారు. 

తొలుత ఈ నెల 16న అవినాష్ రెడ్డిని విచారణకు రావాల్సిందిగా సీబీఐ నోటీసులు జారీచేసింది. అయితే ఈ క్రమంలోనే విచారణకు హాజరయ్యేందుకు నాలుగు రోజుల సమయం కోరుతూ  సీబీఐ అధికారులకు అవినాష్ రెడ్డి లేఖ రాశారు. ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాల వల్ల విచారణకు రాలేనని చెప్పారు. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి విజ్ఞప్తిపై సీబీఐ అధికారులు సానుకూలంగా స్పందించారు. అవినాష్ రెడ్డికి మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19న (శుక్రవారం) విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. 

Also Read: సీఎం జగన్ దంపతుల ఆశీస్సులతో.. వైరల్‌గా మారిన ఎమ్మెల్యే రాపాక కుమారుడి పెళ్లి పత్రిక..!

అయితే శుక్రవారం కూడా సీబీఐ విచారణకు హాజరుకాలేదు. తన తల్లి లక్ష్మమ్మకు అనారోగ్యం కారణంతో విచారణకు హాజరుకాలేనని వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులకు సమాచారం అందజేశారు. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్న అవినాష్ రెడ్డి లాయర్లు.. ఆయన తరఫున లేఖను సమర్పించారు. ఆ సమయంలోనే అవినాష్ రెడ్డి పులివెందుల వైపు పయనమయ్యారు. మరోవైపు అవినాష్ రెడ్డిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్నట్టుగా మీడియా కథనాలు వెలువడ్డాయి. 

Also Read: విశాఖలో దారుణం.. బీచ్‌లో ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు..!!

అయితే మార్గమధ్యలో తాడిపత్రి మండలం చుక్కలూరు వద్ద లక్ష్మమ్మను తరలిస్తున్న అంబులెన్స్ ఎదురుకావడంతో అవినాష్ కూడా తిరిగి హైదరాబాద్ వైపు పయనమయ్యారు. అయితే లక్ష్మమ్మను హైదరాబాద్‌కు తీసుకురానున్నట్టుగా భావించిన చివరకు.. సాయంత్రం 5 గంటల సమయంలో కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమెకు అక్కడే చికిత్స జరుగుతుంది. దీంతో అవినాష్ రెడ్డి అక్కడే ఉండిపోయారు. 

click me!