తిరుపతి-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌లో రెచ్చిపోయిన దొంగలు..

Published : May 20, 2023, 10:46 AM IST
తిరుపతి-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌లో రెచ్చిపోయిన దొంగలు..

సారాంశం

తిరుపతి-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు రెచ్చిపోయారు. మార్గమధ్యలో దోపిడీకి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

కడప: తిరుపతి-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు రెచ్చిపోయారు. మార్గమధ్యలో దోపిడీకి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. తిరుపతి-గుంటూరు ఎక్స్‌ప్రెస్ రాత్రి 730 గంటల సమయంలో తిరుపతి నుంచి బయలుదేరాల్సి ఉంది. కానీ దాదాపు గంట ఆలస్యంగా అక్కడి నుంచి రైలు కదిలింది. అయితే కమలాపురం రైలు నిలయం దాటిన తర్వాత రైలు ఆగింది. అప్పుడు 20 నుంచి 25 మంది దొంగలు ట్రైన్‌లో ఎక్కినట్టుగా చెబుతున్నారు.. ఎస్‌1 నుంచి ఎస్‌6 వరకు ఉన్న బోగీల్లో పలువురు ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేశారు. 

అయితే దోపిడీని ప్రతిఘటించేందుకు యత్నించినవారిపై దాడికి కూడా పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రొద్దుటూరులో పోలీసులు బోగీల్లో బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్నట్లు తెలుస్తోంది. రాత్రిపూట  రైళ్లలో భద్రత పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?