విశాఖలో దారుణం.. బీచ్‌లో ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు..!!

Published : May 20, 2023, 11:14 AM ISTUpdated : May 20, 2023, 12:09 PM IST
విశాఖలో దారుణం.. బీచ్‌లో ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు..!!

సారాంశం

విశాఖపట్నంలోని మహారాణిపేట పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బీచ్‌‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది.

విశాఖపట్నంలోని మహారాణిపేట పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బీచ్‌‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఆ మహిళను ఆమె ప్రియుడే హత్య చేశాడు. అనంతరం వెళ్లి పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. వివరాలు.. బాధిత మహిళ శ్రావణి జగదాంబ కూడలిలోని ఓ షాపింగ్‌ మాల్‌లో పనిచేస్తున్నాడు. ఆమె పరవాడకు చెందిన ప్రియుడు గోపాలకృష్ణ అనే వ్యక్తి ఈరోజు తెల్లవారుజామున బీచ్‌కు వెళ్లింది. అయితే అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే గోపాలకృష్ణ.. శ్రావణిని గొంతు నులిమి హత్య చేశారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. శ్రావణి మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక, హత్య చేసిన అనంతరం గోపాలకృష్ణ గాజువాక పోలీసు ఎదుట లొంగిపోయినట్టుగా సమాచారం. అయితే శ్రావణికి గతంలోనే వివాహం అయినట్టుగా తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Also Read: సీఎం జగన్ దంపతుల ఆశీస్సులతో.. వైరల్‌గా మారిన ఎమ్మెల్యే రాపాక కుమారుడి పెళ్లి పత్రిక..!

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్