వైఎస్ వివేకా హత్యకేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు: గోవాలో సునీల్ యాదవ్ అరెస్ట్

By narsimha lodeFirst Published Aug 2, 2021, 10:58 PM IST
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరె్డి హత్య కేసులో అనుమానితుడు సునీల్ యాదవ్ ను సీబీఐ అధికారులు గోవాలో అదుపులోకి తీసుకొన్నారు.

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న సునీల్ యాదవ్ ను సీబీఐ అధికారులు సోమవారం నాడు గోవాలో అదుపులోకి తీసుకొన్నారు. ఆయనను కడపకు తీసుకురానున్నారు.మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  తనను అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేయాలని  ఏపీ హైకోర్టులో సునీల్ యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసును ఒప్పుకోవాలని తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆయన కోర్టును కోరారు.

సునీల్ యాదవ్ బంధువులను కూడ సీబీఐ అధికారులు ఇటీవల విచారించారు. 60 రోజులుగా సీబీఐ అధికారులునిరాటంకంగా విచారణ సాగిస్తున్నారు.2019 మార్చి 14వ తదీ రాత్రి తన నివాసంలోనే వివేకానందరెడ్డి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ విషయమై సిట్ లు విచారణ నిర్వహించాయి. అయితే వివేకానందరెడ్డి కూతురితో పాటు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవి, వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డిలు సీబీఐ దర్యాప్తు చేయాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.


 

click me!