మూడు రోజుల్లో పెళ్లి: ప్రియురాలితో వరుడు జంప్, సూసైడ్

Published : Aug 02, 2021, 08:59 PM IST
మూడు రోజుల్లో పెళ్లి: ప్రియురాలితో వరుడు జంప్, సూసైడ్

సారాంశం

మూడు రోజుల్లో పెళ్లి ఉందనగానే  ప్రేమ జంట సోమవారం నాడు ఆత్మహత్య చేసుకొంది. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం శతకొడువాసులుగా గుర్తించారు. ఈ నెల 4వ తేదీన అదంవలీ పెళ్లి. తన ప్రియురాలితో గుంటూరు జిల్లాలో ఆయన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొన్నాడు.  

గుంటూరు: గుంటూరు జిల్లాలో సోమవారంనాడు విషాదం చోటు చేసుకొంది. రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకొంది. ఇంటి నుండి పారిపోయిన ప్రేమ జంట ఆత్మహత్య  చేసుకొంది. మృతులను ప్రకాశం జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.  ప్రకాశం జిల్లాలోని 
 పుల్లలచెరువు మండలం శతకొడువాసులుగా గుర్తించారు.. శతకొడుకు చెందిన అదంవలీ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఈ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు.

ఈ నెల 4వ తేదీన అదంవలీ వివాహన్ని నిర్ణయించారు.. మరో మూడు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది.ఈ సమయంలో తన ప్రియురాలిని తీసుకొని వచ్చిన అదంవలీ గుంటూరు జిల్లాలోని వినుకొండ వద్ద రైలు కింద ఆత్మహత్య చేసుకొన్నారు.ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు మృతుల కుటుంబసభ్యులకు సమాచారం పంపారు.   పెళ్లికి మూడు రోజుల ముందే అదంవలీ  ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబంలో  విషాదం నెలకొంది.మృతదేహలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu