దేవినేని ఉమాను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారా?: మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలనం

By narsimha lodeFirst Published Aug 2, 2021, 9:14 PM IST
Highlights


రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండ్‌ను బదిలీ చేయడంపై అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రశ్నించారు. మాజీ మంత్రి దేవినేని ఉమాను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారా అని అనుమానాన్ని వ్యక్తం చేశారు. 

రాజమండ్రి:  నిజాయితీగా పనిచేసిన రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌ను ఎందుకు బదిలీ చేశారని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్  ప్రశ్నించారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకువచ్చినప్పుడు జైలర్ డ్యూటీలో ఉన్నారని ఆయన గుర్తు చేశారు.

సెలవులో ఉన్న సూపరింటెండెంట్ రాజారావును బదిలీ చేయటం సిగ్గుచేటని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ అధికారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, దళితుల పట్ల ముఖ్యమంత్రి జగన్ వివక్ష చూపుతున్నారని విర్శించారు.రాజమండ్రి సెంట్రల్ జైలులో దేవినేనిని హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారా? ఆనే అనుమానం కలుగుతోందన్నారు.

 సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాజారావు బదిలీ, దేవినేని హత్యకు కుట్రపై హైకోర్టు సుమోటాగా విచారణ చేపట్టాలని హర్షకుమార్ కోరారు. వైసీపీ ప్రభుత్వంలో 70 మంది సలహాదారులను పెట్టుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. సీఎం బినామీ పేర్లతో విశాఖలో భూములు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఇసుక, మైనింగ్ మాఫియాలో కలెక్టర్లు బాగస్వామ్యం అవుతున్నారని హర్షకుమార్ విమర్శించారు.


 

click me!