YS Sharmila: నాకు సెక్యూరిటీ ఎందుకు ఇవ్వడం లేదు.. చెడు జరగాలనేనా?: జగన్ పై షర్మిల పరోక్ష వ్యాఖ్యలు

By Mahesh K  |  First Published Feb 7, 2024, 8:04 PM IST

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సీఎం జగన్ పై పరోక్షంగా తీవ్ర ఆరోపణలు చేశారు. తాను అడిగినా.. ఒక మహిళ అని కూడా చూడకుండా తనకు భద్రత ఇవ్వడం లేదని అన్నారు. అంటే.. తనకు చెడు కోరుకుంటున్నారనే అర్థం కదా.. అని పేర్కొన్నారు.
 


CM Jagan: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమె అన్న, వైసీపీ చీఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అడిగినా తనకు ఎందుకు సెక్యూరిటీ ఇవ్వడం లేదని, చెడు జరగాలనేనా అని నిలదీశారు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా రాష్ట్రంలో తాను విస్తృతంగా పర్యటించాల్సి ఉంటుందని, అందుకే తనకు భద్రత కూడా అవసరం అని షర్మిల చెప్పారు. తనకు భద్రత కావాలని ప్రభుత్వాన్ని అడిగినా.. స్పందించడం లేదని పేర్కొన్నారు. ఒక మహిళ అని కూడా చూడటం లేదని అన్నారు. అడిగినా భద్రత ఇవ్వడం లేని మీకు.. ప్రజాస్వామ్యంపై ఎంతటి చిత్తశుద్ధి ఉన్నదని ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదా? అసలు ప్రజాస్వామ్యం అని కనీసం గుర్తుకైనా ఉన్నదా? అని షర్మిల ప్రశ్నలు కురిపించారు. మీకు సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా? మిగిలిన నాయకులకు ఉండనవసరం లేదా? అని అడిగారు. ప్రతిపక్షాలకూ రక్షణ కల్పించాల్సిన బాధ్యత లేదా? అని అన్నారు. అంటే.. మా చెడు కోరుకుంటున్నారనే కదా ఇక్కడ అర్థం అని ఆమె పరోక్షంగా అన్న జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.

Latest Videos

Also Read : Medaram Jathara: 21 నుంచి సమ్మక్క, సారలమ్మ జాతర.. మేడారం జాతర చరిత్ర మీకు తెలుసా?

కాగా, సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. వీరిద్దరూ ప్రజా ప్రయోజనాల కోసం పని చేయడం లేదనీ, అసలు ఆలోచించడమూ లేదని పేర్కొన్నారు. ఒకరికి కుర్చీ ఎలా కాపాడుకోవాలా? అనే ఆరాటం.. ఆ కుర్చినీ ఎలా సంపాదించాలా? అని పోరాటం మరొకరదని అన్నారు. ఐదేళ్లు చంద్రబాబు, ఐదేళ్ల జగన్ అధికారంలో ఉన్నా ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడ లేదని, పోలవరం ప్రాజెక్టు గురించీ కేంద్రాన్ని నిలదీయలేదని పేర్కొన్నారు. ఇక కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా ఏపీ ప్రయోజనాల గురించి ఆలోచించనే లేదని విమర్శించారు.

click me!