Purandheshwari: చంద్రబాబు పర్యటనపై ఏపీ బీజేపీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆమె ఏమన్నారంటే?

Published : Feb 07, 2024, 07:23 PM IST
Purandheshwari: చంద్రబాబు పర్యటనపై ఏపీ బీజేపీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆమె ఏమన్నారంటే?

సారాంశం

చంద్రబాబు పర్యటనపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక వైపు చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో ఏపీలో బీజేపీ, టీడీపీ పొత్తు ఫిక్స్ అయినట్టే అనే అభిప్రాయాలు వస్తుండగా.. పురంధేశ్వరి మాత్రం చంద్రబాబు పర్యటన గురించి తమకు తెలియదని కామెంట్ చేశారు.  

Chandrababu Naidu: టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఏపీలో టీడీపీ- జనసేన- బీజేపీ పొత్తు విషయం పైనే ఆయన బీజేపీ జాతీయ నాయకులతో చర్చిస్తారని ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనతో ఏపీలో పొత్తులపై స్పష్టత వస్తుందనీ అంటున్నారు. అసలు పొత్తులపై తేల్చడానికి బీజేపీ అగ్రనాయకత్వమే చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి ఢిల్లీకి రప్పించిందనీ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ మాత్రం మాట బయట పడకుండా జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యంగా ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.

చంద్రబాబు నాయుడు ఢిల్లీకి ఎందుకు వెళ్లుతారో తమకు తెలియదని పురంధేశ్వరి అన్నారు. చంద్రబాబు పర్యటనతో పొత్తు పొడుస్తుందనే చర్చ జరుగుతుండగా.. అసలు ఆయన పర్యటన గురించి తమకు తెలియదని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Also Read : Medaram Jathara: 21 నుంచి సమ్మక్క, సారలమ్మ జాతర.. మేడారం జాతర చరిత్ర మీకు తెలుసా?

ఇక బీజేపీ నేత సత్యకుమార్ కూడా ఇదే కోణంలో మాట్లాడారు. తినబోతూ రుచి చూడటం ఎందుకు? మరో రెండు మూడు రోజుల్లో బీజేపీ, టీడీపీ పొత్తుపై స్పష్టత వస్తుంది కదా.. అని అన్నారు. అయితే.. పొత్తుల పై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని.. అందులో బీజేపీ రాష్ట్ర శాఖ అభ్యంతరాలు ఏమీ ఉండవని స్పష్టం చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!