అది వాళ్లకు ఇచ్చే గౌరవం.. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై షర్మిల సంచలన కామెంట్స్..

By Sumanth KanukulaFirst Published Sep 22, 2022, 1:16 PM IST
Highlights

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై సీఎం జగన్ సోదరి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా స్పందించారు. 

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. హెల్త్ వర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు బుధవారం ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అయితే జగన్ సర్కార్ ‌తీసుకున్న నిర్ణయాన్ని విపక్ష పార్టీల నేతలు, ఎన్టీఆర్ అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ పరిణామంపై సీఎం జగన్ సోదరి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా స్పందించారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై ఓ టీవీ చానల్‌ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమధానమిచ్చిన షర్మిల.. పేర్లను మార్చకూడదని తెలిపారు. 

పేర్లను మారిస్తే.. పవిత్రత పోతుందని షర్మిల అన్నారు. ఒక్క పేరంటూ పెట్టిన తర్వాత .. ఆ పేరును తరతరాల పాటు కంటిన్యూ చేస్తే వాళ్లకు గౌరవం ఇచ్చినట్టుగా ఉంటుందన్నారు. అంతేకాకుండా కన్ఫ్యూజన్ ఉండదన్నారు. ఒక్కొసారి ఒక్కో పేరు పెట్టుకుంటూ పోతే  ఎవరు ఏది రిఫర్ చేస్తున్నారో కూడా అర్థం కాదని అన్నారు. 

అయితే వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయి. షర్మిల చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోన టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. షర్మిల చేసిన వ్యాఖ్యల వీడియోను షేర్ చేస్తూ.. వర్సిటీ పేరు మార్పుపై జగన్ నిర్ణయాన్ని కార్నర్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 

Also Read: హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలిగించటాన్ని ఖండించిన నందమూరి రామకృష్ణ.. ఏమన్నారంటే..

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం శాసనసభలో బిల్లు పెట్టింది. వర్సిటీకి వైఎస్సార్ పేరు పెడుతూ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సవరణ బిల్లును రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని సభలో ప్రవేశపెట్టారు. పలువురు సభ్యులు మాట్లాడిన అనంతరం ఈ బిల్లు ఆమోదం పొందినట్టుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అయితే టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలోని పలుచోట్ల టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ కూడా ఈ నిర్ణయాన్ని ఖండించారు. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలని డిమాండ్ చేశారు. 
 

click me!