హెల్త్ యూనివర్శిటీకి వైఎస్ఆర్ పేరు: నేడు గవర్నర్ ను కలవనున్న చంద్రబాబు

By narsimha lode  |  First Published Sep 22, 2022, 11:30 AM IST

హెల్త్ యూనివర్శిటీకి  వైఎస్ఆర్ పేరు పెట్టడంపై ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను టీడీపీ చీఫ్ చంద్రబాబు కలిసి పిర్యాదు చేయనున్నారు. హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని కోరనున్నారు. ఇవాళ గవర్నర్ తో బాబు భేటీ అవుతారు. 
 


అమరావతి: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు విషయమై ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను టీడీపీచీఫ్ చంద్రబాబునాయుడు గురువారం నాడు కలవనున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి వైఎస్ఆర్ పేరును పెడుతూ నిన్న ఏపీ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.ఈ బిల్లును అసెంబ్లీలో, మండలిలో టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ విషయమై ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు.  అసెంబ్లీ కార్యకలాపాలకు ఆటంకం కల్గిస్తున్నారనే కారణంగా అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యులను  స్పీకర్ సస్పెండ్ చేశారు. ఇదే విషయమై టీడీపీ సభ్యులు మండలిలో ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనతో  మండలి రెండు సార్లు వాయిదా పడింది. 1986లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ యూనివర్శిటీకి  ఎన్టీఆర్ పేరును మార్చి వైఎస్ఆర్ పేరును పెట్టడంపై టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. 

వైద్యం విషయంలో  అనేక సంస్కరణలు తీసుకువచ్చినందునే హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఎన్టీఆర్ అవమానించడం తమ ఉద్దేశ్యం కాదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది.  హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చుపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి.  ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు తీవ్రంగా మండిపడ్డారు.

Latest Videos

undefined

also read:హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలిగించటాన్ని ఖండించిన నందమూరి రామకృష్ణ.. ఏమన్నారంటే..

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు విషయమై ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తో చర్చించనున్నారు.  హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలని చంద్రబాబు గవర్నర్ ను కోరనున్నారు.హెల్త్ యూనివర్శిటీకి వైఎస్ఆర్ పేరును ఎందుకు మార్చాల్సి వచ్చిందనే విషయమై ఏపీ సీఎం వైఎస్ జగన్  ఏపీ అసెంబ్లీలో ప్రకటించారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు కంటే తామే ఎక్కువగా గౌరవించిన విషయమై జగన్ గుర్తు చేశారు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన విషయాన్ని కూడా  జగన్ నిన్న అసెంబ్లీలో  జరిగిన చర్చలో ప్రకటించిన విషయం తెలిసిందే. 

హెల్త్ యూనివర్శిటీకి వైఎస్ఆర్ పేరు మార్చడంతో మనోవేదనకు గురైన అధికార భాషా సంఘం చైర్మెన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలని కూడా డిమాండ్ చేశారు. 

click me!