ప్రిన్స్ ధియేటర్ లో అవెంజర్స్ సినిమా చూసిన వైఎస్ జగన్

Published : May 03, 2019, 04:27 PM ISTUpdated : May 03, 2019, 04:28 PM IST
ప్రిన్స్ ధియేటర్ లో అవెంజర్స్ సినిమా చూసిన వైఎస్ జగన్

సారాంశం

బిజీబిజీగా గడుపుతున్న వైఎస్ జగన్ గురువారం అవెంజర్స్ సినిమాకు వెళ్లినట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ లో రిలీజ్ అయి ప్రస్తుతం రికార్డులు మోతమోగిస్తున్న అవేంజర్స్: ఎండ్ గేమ్ సినిమాను చూశారట. సూపర్ స్టార్ మహేశ్ బాబుకు చెందిన ఏఎంబీ సినిమాస్ లో జగన్ కుటుంబ సమేతంగా వీక్షించినట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్: ప్రజా సంకల్పయాత్ర, ఆ తర్వాత ఎన్నికల ప్రచారం ఇలా రెండేళ్లుగా ప్రజల మధ్యే తిరుగుతూ నిత్యం బిజీబిజీగా గడిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికల అనంతరం సేద తీరుతున్నారు. 

ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లారు. అక్కడ కాస్త రిలాక్స్ అయిన వైఎస్ జగన్ అనంతరం  పార్టీ కార్యక్రమాల్లో బీజీబిజీగా గడుపుతున్నారు. పార్టీ కార్యక్రమాలతోపాటు కార్యకర్తల ఆహ్వానం మేరకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 

బిజీబిజీగా గడుపుతున్న వైఎస్ జగన్ గురువారం అవెంజర్స్ సినిమాకు వెళ్లినట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ లో రిలీజ్ అయి ప్రస్తుతం రికార్డులు మోతమోగిస్తున్న అవెంజర్స్: ఎండ్ గేమ్ సినిమాను చూశారట. సూపర్ స్టార్ మహేశ్ బాబుకు చెందిన ఏఎంబీ సినిమాస్ లో జగన్ కుటుంబ సమేతంగా వీక్షించినట్లు తెలుస్తోంది. 

అందుకు సంబంధించి ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మెుత్తానికి ఎన్నికల అనంతరం ఫలితాలపై ఆయా పార్టీల నేతలు టెన్షన్లో ఉంటే జగన్ మాత్రం ఇలా రిలాక్స్ అవుతున్నారన్నమాట. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu