సెంచరీ కొడతాం, మళ్లీ అధికారంలోకి వస్తాం: చంద్రబాబు ధీమా

Published : May 03, 2019, 03:40 PM IST
సెంచరీ కొడతాం, మళ్లీ అధికారంలోకి వస్తాం: చంద్రబాబు ధీమా

సారాంశం

ఈ ఎన్నికల్లో వెయ్యి శాతం తమ పార్టీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వందకు పైగా ఎమ్మెల్యే సీట్లు దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఐటీవీ నెట్‌వర్క్ నిర్వహించిన కాంక్లేవ్‌లో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న చంద్రబాబు మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

అమరావతి: ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. ఈ ఎన్నికల్లో వెయ్యి శాతం తమ పార్టీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

వందకు పైగా ఎమ్మెల్యే సీట్లు దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఐటీవీ నెట్‌వర్క్ నిర్వహించిన కాంక్లేవ్‌లో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న చంద్రబాబు మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఎన్నికల కంటే ఈవీఎంల తీరుమీదే ఎక్కు తృష్టిపెట్టాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.

మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల కంటే ఈవీఎంల తీరు మీదే ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడించని చెప్పారు. మోదీ ప్రభుత్వం ఎన్నికల యంత్రాంగాన్ని మానిప్యులేట్ చేస్తోందని ఆరోపించారు. అందువల్లే బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమై కోర్టుకెక్కాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. 

ఇకపోతే ఈ ఐటీవీ నెట్ వర్క్ నిర్వహించిన కాంక్లేవ్ లో ముక్తార్ అబ్బాస్ నక్వీ, సుబ్రహ్మణ్య స్వామి, రణ్ దీప్ సుర్జీవాలా, జాన్ అబ్రహం లాంటి అనేకమంది ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కాంక్లేవ్‌లో కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయెల్ లు కూడా పాల్గొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Kakinada : గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా కాకినాడ.. చంద్రబాబు, పవన్ స్కెచ్ మామూలుగా లేదుగా !
YCP Leaders Submit Petition to DGP Office Seeking Justice in Salman MurderCase | Asianet News Telugu