సీఎం కుర్చీ: చంద్రబాబు ముహుర్తమిదీ, జగన్ ముహర్తమదీ....

By narsimha lodeFirst Published May 3, 2019, 4:17 PM IST
Highlights

20 రోజుల తర్వాత ఏపీలో ఎవరు సీఎం అవుతారనే విషయమై స్పష్టత రానుంది. కానీ, టీడీపీ నేతలు కూడ మరోసారి తాము అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్నారు

అమరావతి: 20 రోజుల తర్వాత ఏపీలో ఎవరు సీఎం అవుతారనే విషయమై స్పష్టత రానుంది. కానీ, టీడీపీ నేతలు కూడ మరోసారి తాము అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్నారు. వైసీపీ నేతలు తమ పార్టీ అధికారంలోకి వస్తోందని కూడ ఆ పార్టీ నేతలు విశ్వాసంతో ఉన్నారు.

ఏపీ రాష్ట్రానికి ఎవరు సీఎం అవుతారో సరిగ్గా 20 రోజుల తర్వాత తేలనుంది.  రెండు పార్టీల అధినేతలు  కూడ తాము ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేసేందుకు ముహుర్తాలు కూడ  నిర్ణయం తీసుకొన్నారు.

గురువారం నాడు టీడీపీ నేతలతో చంద్రబాబునాయుడు ప్రతి రోజూ టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. టీడీపీ నేతల్లో విశ్వాసాన్ని పాదుకొల్పేందుకు బాబు ప్రయత్నాలు చేస్తున్నారు.టీడీపీ మరోసారి అధికారంలోకి రానుందని కూడ బాబు పార్టీ నాయకులకు తేల్చి చెప్పారు.

తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెబుతున్నానని బాబు పార్టీ నేతలకు వివరించారు. అయితే ఎంత మెజారిటీ వస్తోందనేదే తేలాల్సి ఉందని బాబు పార్టీ నేతలకు వివరించారు.చంద్రబాబునాయుడు మే 25వ తేదీన మరోసారి ఏపీ  ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

ఇదిలా ఉంటే  ఏపీలో తామే అధికారంలోకి వస్తామని  వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ మే 26వ తేదీన ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహుర్తాన్ని నిర్ణయించుకొన్నారు. 

ఈ మేరకు వైసీపీ నేతలు కూడ చెబుతున్నారు.నాగార్జున యూనివర్శిటీ ప్రాంగణంలో చంద్రబాబునాయుడు రెండోసారి సీఎంగా ప్రమాణం చేయనున్నారని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

click me!