పంతం నెగ్గించుకొన్న జగన్: మూడు రాజధానులపై బాబు ఏం చేస్తారు

By narsimha lodeFirst Published Jul 31, 2020, 4:39 PM IST
Highlights

మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పంతం నెగ్గించుకొన్నారు. మూడు రాజధానుల బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను గవర్నర్ శుక్రవారంనాడు ఆమోదం తెలిపారు. దీంతో మూడు రాజధానుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

అమరావతి: మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పంతం నెగ్గించుకొన్నారు. మూడు రాజధానుల బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను గవర్నర్ శుక్రవారంనాడు ఆమోదం తెలిపారు. దీంతో మూడు రాజధానుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

2014లో ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత  అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకొన్నాడు. ప్రధాని మోడీ అమరావతికి శంకుస్థాపన చేశాడు. 2015 అక్టోబర్ 21 వ తేదీన శంకుస్థాపన చేశారు. రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబునాయుడు ప్రభుత్వం ముప్పై మూడు వేలకు పైగా ఎకరాల భూమిని సేకరించింది.

ఈ భూ సేకరణను ఆనాడు విపక్షంలో ఉన్న వైసీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని శాసనసభ రాజధానికి మాత్రమే ఇక నుండి కొనసాగనుంది. రాష్ట్రంలో మూడురాజధానులను చేయాలని ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ మేరకు  గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ  సమావేశాల్లో సీఎం జగన్ మూడు రాజధానుల అంశాన్ని సూచన ప్రాయంగా ప్రకటించారు.

మూడు రాజధానుల ఏర్పాటు విషయమై  జీఎన్ రావు కమిటీ ఏర్పాటు చేసింది. 2019 సెప్టెంబర్ 13వ తేదీన జీఎన్ రావు కమిటిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మూడు నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పలువురి నుండి వివరాలను సేకరించింది. 2019 డిసెంబర్ 20వ తేదీన జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చింది.

పరిపాలన వికేంద్రీకరణకు జీఎన్ రావు కమిటీ సిఫారసు చేసింది. దీంతో బోస్టన్ కమిటీ నుండి కూడ రాష్ట్ర ప్రభుత్వం నివేదికను తెప్పించుకొంది. ఈ ఏడాది జనవరి 20వ తేదీన శాసనసభ ఈ రెండు బిల్లులకు అసెంబ్లీ ఆమోదించింది. 

అయితే అదే సమయంలో ఈ బిల్లులను సెలెక్ట్ కమిటికి పంపాలని కోరిన విషయం తెలిసిందే.

జూన్ మాసంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన మరోసారి ఈ రెండు బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. శాసనమండలికి పంపారు. ఈ బిల్లులపై ఎలాంటి చర్చ జరగకుండానే మండలి వాయిదా పడింది. 

also read:జగన్ కు జోష్, చంద్రబాబుకు షాక్: మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం

శాసనమండలి వాయిదా పడిన నెల రోజుల తర్వాత ఈ బిల్లులను ఆమోదం కోసం గవర్నర్ కు ప్రభుత్వం పంపింది. ఈ బిల్లులను ఆమోదించకుండా ఉండాలని విపక్షం లేఖలు రాసింది. యనమల రామకృష్ణుడు, చంద్రబాబు గవర్నర్ కు లేఖ రాశాడు.ఈ రెండు బిల్లుల విషయంలో న్యాయ సలహా తీసుకొన్న తర్వాత గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపారు. 

మూడు రాజధానుల బిల్లులను, సీఆర్ డీ ఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలపడంతో చంద్రబాబునాయుడు ఏం చేస్తారనేది ప్రస్తుతం అందరిలో ఆసక్తి నెలకొంది. అమరావతి రాజధానికి చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో శంకుస్థాపన చేశారు. మూడు రాజధానులను చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు.

ఈ రెండు బిల్లులను అడ్డుకొనేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నించింది. శాసనమండలిలో తమ పార్టీకి బలం ఉండడంతో ఈ బిల్లులను అడ్డుకొంది. ప్రస్తుతం ఈ రెండు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారు.  ఇప్పటికే అమరావతిలో రైతుల పక్షాన చంద్రబాబునాయుడు ఆందోళనలో పాల్గొన్నారు.

ఈ రెండు బిల్లులు చట్టరూపం తీసుకొన్నాయి.  ఈ చట్టాలను కోర్టులో సవాల్ చేసేందుకు అవకాశం లేకపోలేదు. ఇప్పటికే అమరావతిపై అమరావతి పరిరక్షణ సమితి కోర్టులో కేసులు వేశాయి. ఈ కేసు సందర్భంగా ప్రభుత్వ వినిపించిన వాదనను విపక్షాలు గుర్తు చేస్తున్నాయి.

ఈ రెండు బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించినా కూడ తాను అనుకొన్నట్టుగానే ఈ బిల్లులను పాస్ చేయించుకోవడంలో జగన్ పై చేయి సాధించాడు. అయితే ఈ బిల్లులను అడ్డుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నించినా టీడీపీ అనుకొన్నది సాధించలేకపోయింది. అయితే ఇప్పుడు కోర్టులను ఆశ్రయించేందుకు అవకాశం దక్కింది. ఈ విషయంలో టీడీపీ ఏం చేస్తోందోననేది ప్రస్తుతం అత్యంత కీలకంగా మారింది.
 

click me!