మొబైల్ ఫోన్ దొంగతనం.. బాలుడి దారుణ హత్య

Published : Jul 31, 2020, 04:26 PM IST
మొబైల్ ఫోన్ దొంగతనం.. బాలుడి దారుణ హత్య

సారాంశం

ఈ ఘటనలో దాడికి పాల్పడిన ఇరు వర్గాలు రాజీ కుదుర్చుకుని పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఒప్పందం కుదుర్చుకున్నారు. 

మొబైల్ ఫోన్ కోసం ఓ బాలుడి ప్రాణం తీశారు. ఫోన్ దొంగలించాడనే కారణంతో.. చిన్నపిల్లాడనే కనికరం కూడా లేకుండా కొట్టారు. కాగా.. ఆ దెబ్బలు తట్టుకోలేక బాలుడు ప్రాణాలు వదిలాడు. ఈ విషాదకర సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన ఓ బాలుడిని చితకబాదారు. మొబైల్ దొంగించాడంటూ ఇరు వర్గాలు కలిసి ఓ బాలుడిని చితకబాదారు. ఈ దాడిలో బాలుడు తీవ్ర గాయపడ్డాడు. స్పృహతప్పి నేలకొరిగాడు. అయితే బాలుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ఈ ఘటనలో దాడికి పాల్పడిన ఇరు వర్గాలు రాజీ కుదుర్చుకుని పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ విషయంలో అందరికీ తెలియడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

YS Sharmila: కోలుకుంటోన్న వైఎస్ ష‌ర్మిల‌.. ఇంత‌కీ ఆమెకు ఏం జ‌రిగిందంటే.?
Chiranjeevi: బాస్ ఈజ్ బ్యాక్.. ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై మెగాస్టార్.. చిరంజీవికి కూటమి సర్కార్ బిగ్ ఆఫర్ !