వైఎస్ వివేకానంద విగ్రహన్ని ఆవిష్కరించిన జగన్

By narsimha lodeFirst Published Sep 2, 2019, 12:18 PM IST
Highlights

దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి విగ్రహన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్  సోమవారం నాడు ఆవిష్కరించారు.

పులివెందుల: దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి విగ్రహన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్  సోమవారం నాడు ఆవిష్కరించారు.

దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని పులివెందులకు ఆయన చేరుకొన్నారు.ఈ సందర్భంగా పులివెందులలో ఏర్పాటు చేసిన వైఎస్ వివేకానందరెడ్డి విగ్రహన్ని జగన్ ఆవిష్కరించారు.

ఈ ఏడాది మార్చి 14వ తేదీన ఇంట్లోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యకు పాల్పడిన నిందితులను పట్టుకొనేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.ఈ సిట్  విచారణను వేగవంతం చేసింది.

ఇవాళ  దివంత  సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 10వ వర్ధంతి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద సీఎం జగన్, ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు.

click me!