వైఎస్ఆర్ పదో వర్థంతి.. తండ్రిని తలుచుకున్న జగన్

By telugu teamFirst Published Sep 2, 2019, 9:16 AM IST
Highlights

వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో ఆయన తన తండ్రిని తలుచుకున్నారు. ట్విట్టర్ లో వైఎస్ గొప్పతనాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశారు. 
 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదో వర్థంతి నేడు. ఈ సందర్భంగా పులివెందలలో వైఎస్ఆర్ వర్థంతి కార్యక్రమాలు నిర్వహించతలపెట్టారు. ఇందులో భాగంగా సీఎం జగన్ ఈరోజు పులివెందల వెళ్లారు. వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో ఆయన తన తండ్రిని తలుచుకున్నారు. ట్విట్టర్ లో వైఎస్ గొప్పతనాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశారు. 

పరిపాలన, ప్రజాసంక్షేమం విషయంలో వైఎస్‌ నిర్ణయాలు దేశానికే మార్గదర్శకాలయ్యాయని సీఎం జగన్‌ అన్నారు. రాష్ట్రాన్ని వైఎస్‌ నడిపించిన తీరు.. జాతీయస్థాయిలో మనల్ని ఎంతో గర్వించేలా చేసిందని గుర్తుచేశారు. వైఎస్‌ భౌతికంగా దూరమైనా పథకాల రూపంలో బతికే ఉన్నారని తెలిపారు. వైఎస్‌ స్ఫూర్తి ఎప్పటికీ విలువల బాటలో నడిపిస్తూనే ఉంటుందని సీఎం ట్వీట్ చేశారు.
 

click me!