డీఎస్సీ అభ్యర్థులకు నరకం చూపిస్తున్న చంద్రబాబు:వైఎస్ జగన్

Published : Nov 24, 2018, 09:14 PM IST
డీఎస్సీ అభ్యర్థులకు నరకం చూపిస్తున్న చంద్రబాబు:వైఎస్ జగన్

సారాంశం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ అభ్యర్థులతో తెలుగుదేశం ప్రభుత్వం దాగుడు మూతలు ఆడుతుందంటూ విమర్శించారు. డీఎస్సీ అభ్యర్థులకు చంద్రబాబు గారు నరకం చూపిస్తున్నారు అని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు.   

విజయనగరం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ అభ్యర్థులతో తెలుగుదేశం ప్రభుత్వం దాగుడు మూతలు ఆడుతుందంటూ విమర్శించారు. డీఎస్సీ అభ్యర్థులకు చంద్రబాబు గారు నరకం చూపిస్తున్నారు అని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. 
 
రాష్ట్రంలో 22వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీలు ఉంటే వాయిదాల మీద వాయిదాలు వేస్తూ చివరకు 7వేల పోస్టులకు సరిపెట్టారు. పోస్టుల కుదింపు పేరుతో సిలబస్ మార్పులతో పరీక్షా సమయంపై గందరగోళం సృష్టిస్తూ మానసిక ఇబ్బందులు పెడుతున్నారు. 

టీచర్ గా ఎంపిక కావాలంటే కోచింగ్ ల పేరుతో ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితికి తీసుకువచ్చారు. దేవుడు దయ, ప్రజల ఆశీస్సులతో మన పప్రభుత్వం రాగానే మెుదటి ఏడాదే డీఎస్సీ నిర్వహిస్తాం అంటూ జగన్ ట్వీట్ చేశారు.  

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే