గురువారం పాదయాత్రకు బ్రేక్

First Published Feb 7, 2018, 10:44 AM IST
Highlights
  • కేంద్రం వైఖరికి నిరసనగా వామపక్షాలు గురువారం రాష్ట్ర బంద్ కు పిలిపిచ్చాయి.

వామపక్షాలు ఇచ్చిన బంద్ కారణంగా గురువారం వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు బ్రేక్ పడుతోంది. పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత ఏపి రాజకీయాల్లో బాగా వేడి మొదలైన సంగతి అందరికీ తెలిసిందే. తాజా బడ్జెట్లో విభజన చట్టంలోని హామీల గురించి కానీ రాష్ట్ర ప్రయోజాల గురించి కానీ కేంద్రం ఒక్కమాట కూడా ప్రస్తావించలేదు. దాంతో భారతీయ జనతా పార్టీ మినహా మిగిలిన రాజకీయ పార్టీలన్నీ కేంద్రంపై మండిపడుతున్నాయి. తప్పని పరిస్దితుల్లో భాగస్వామ్య పార్టీ అయిన టిడిపి కూడా నిరసనలు, ఆందోళనలు మొదలుపెట్టింది. దాంతో పార్లమెంటు సమావేశాలు గందరగోళంగా సాగుతున్నాయి.

ఈ నేపధ్యంలోనే కేంద్రం వైఖరికి నిరసనగా వామపక్షాలు గురువారం రాష్ట్ర బంద్ కు పిలిపిచ్చాయి. వామపక్షాల పిలుపుకు ప్రధాన ప్రతిపక్షం వైసిపితో పాటు కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తోంది. అందుకనే గురువారం నాటి తన పాదయాత్రకు జగన్ బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించారు. మామూలుగా జగన్ పాదయాత్రలో పార్టీ నేతలు, శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.

ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో 82వ రోజు పాదయాత్ర చేస్తున్న సమయంలో కూడా నేతలు, కార్యకర్తలు పాల్గొంటున్న విషయం తెలిసిందే. 1100 కిలోమీటర్లు పూర్తి చేసిన జగన్ గురువారం నాటి 83వ రోజు బ్రేక్ ఇస్తున్నారు. రేపటి బంద్ కు మద్దతుగా నేతలు, శ్రేణులు పాల్గొనాలి కాబట్టి పాదయాత్రకు బ్రేక్ ఇవ్వాలని జగన్ నిర్ణయించారు.

click me!