సంక్రాంతి నుండి రాజధాని నిర్మాణం

Published : Oct 28, 2017, 06:32 AM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
సంక్రాంతి నుండి రాజధాని నిర్మాణం

సారాంశం

‘సంక్రాంతికి రాజధాని నిర్మాణ పనులు ప్రారభమవుతాయి’..ఇది చంద్రబాబునాయుడు చెప్పిన మాటలు.

‘సంక్రాంతికి రాజధాని నిర్మాణ పనులు ప్రారభమవుతాయి’..ఇది చంద్రబాబునాయుడు చెప్పిన మాటలు. విదేశీ పర్యటన తర్వాత హైదరాబాద్ లో దిగి శుక్రవారం సాయంత్రం విజయవాడకు చేరుకున్నారు.

తర్వాత మీడియాతో పిచ్చాపాటి మాట్లాడుతూ, సంక్రాంతికి అటు ఇటుగా రాజధానిలో శాశ్వత భవనాల నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. అసెంబ్లీ మినహా రాజధాని భవనాల డిజైన్ల ఖరారు అయినట్లే అట.  

రాజమౌళి గురించి మాట్లాడుతూ బాహుబలి దర్శకుడు విలువైన సూచనలు చేశారని చెప్పారు. డిజైన్ల ఫైనల్ చేయటంలో కీలకంగా వ్యవహరించారట. మరో 40  రోజుల్లో అసెంబ్లీ డిజైన్లు కూడా ఖరారు చేస్తామని ఆశిస్తున్నట్లు చెప్పారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర గురించి ప్రస్తావిస్తూ ‘ప్రజాసంకల్పయాత్ర’ కు సీరియస్ నెస్ ఉండదని అభిప్రాయపడ్డారు. లేకపోతే జగన్ పాదయాత్ర బ్రహ్మాండమని చెప్పరు కదా ?.

పోలవరం నిర్మాణంపై మాట్లాడుతూ నిధులతో ఇబ్బంది ఉందని అంగీకరించారు. త్వరలోనే అడ్డంకులు తొలగిపోతాయన్నారు. తన విదేశీ పర్యటన విజయవంతం అయిందని, తెలంగాణ టీడీపీలో వ్యవహారాలన్నీ సర్దుకుంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.

 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu