పాదయాత్రపై జగన్ కీలక సమావేశం

First Published Oct 10, 2017, 7:17 AM IST
Highlights
  • తన పాదయాత్రకు సిబిఐ కోర్టు అనుమతిస్తుందన్న నమ్మకం వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో బాగా నమ్మకమున్నట్లుంది.
  • అందుకనే పార్టీ నేతలతో కీలక సమావేశం పెట్టుకున్నారు.

తన పాదయాత్రకు సిబిఐ కోర్టు అనుమతిస్తుందన్న నమ్మకం వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో బాగా నమ్మకమున్నట్లుంది. అందుకనే పార్టీ నేతలతో కీలక సమావేశం పెట్టుకున్నారు. పాదయాత్రకు అనుమతించాలని జగన్ పెట్టుకున్న పిటీషన్ పై ఈనెల 13వ తేదీన కోర్టు తన నిర్ణయాన్ని చెప్పనున్నది. కోర్టు తీర్పు కోసమే అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారన్నది వాస్తవం.

నవంబర్‌ 2వ తేదీ నుంచి మొదలుపెట్టాలని జగన్ నిర్ణయించుకున్న విషయం అందరికీ తెలిసిందే కదా? దానికి చేయాల్సిన ఏర్పాట్లు తదితరాలపై చర్చించేందుకు జగన్ బుధవారం కీలక సమావేశం పెట్టుకున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, జిల్లాల పరిశీలకులు, నియోజకవర్గ సమన్వయకర్తలకు ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా కబురు చేసారు.

వైఎస్‌ జగన్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాదయాత్రను విజయవంతం చేయటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు, భవిష్యత్‌ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ మేరకు పార్టీ నేతలకు ఎంపీ విజయసాయిరెడ్డి సమాచారం అందించారు. ఈ సమావేశానికి ఆహ్వానం అందిన నేతలందరూ తప్పకుండా రావాలని ఎంపీ విజయసాయిరెడ్డి సూచించటం గమనార్హం.

click me!