
పోలవరం ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. సోమవారం పోలవరం ప్రాజెక్ట పనుల పురోగతిపై చంద్రబాబు వర్చువల్ రివ్యూ చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రోజురోజుకూ పోలవరం ప్రాజెక్టు పనులు ఆలస్యం కావడంపై ముఖ్యమంత్రి మండిపడ్డారు. పూర్తిస్థాయిలో యంత్రాలు వచ్చినా లక్ష్యం మేరకు ఎందుకు పనులు జరగడం లేదని అధికారులను, నిర్మాణ సంస్థల ప్రతినిధులను నిలదీసారు.
అనుకున్న స్థాయిలో ఫలితాలు రానప్పుడు సమీక్షలు నిర్వహించి ఉపయోగం ఏంటంటూ ధ్వజమెత్తారు. పనిలో పనిగా అధికారుల పనితీరుపైన కూడా మండిపడ్దారు. నిర్మాణ సంస్థలకు ఎదురవుతున్న ఆర్ధికపరమైన ఇబ్బందులను అధిగమించేందుకు బ్యాంకర్లతో సంప్రదింపులు జరిపి సమస్య పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించారు.