వేసవి విడిది కోసం.. విదేశాలకు జగన్

Published : Apr 22, 2019, 02:11 PM IST
వేసవి విడిది కోసం.. విదేశాలకు జగన్

సారాంశం

ఏపీలో ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఇక తెలియాల్సిందల్లా ఫలితాలే. ఈ ఫలితాలు తెలియాలంటే.. మే 23వరకు వేచి ఉండాల్సిందే. ఈ ఎన్నికల ఫలితాల విడుదలకు ఇంకా నెల సమయం ఉండటంతో అన్ని పార్టీల నేతలు టెన్షన్ గా గడుపుతున్నారు.

ఏపీలో ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఇక తెలియాల్సిందల్లా ఫలితాలే. ఈ ఫలితాలు తెలియాలంటే.. మే 23వరకు వేచి ఉండాల్సిందే. ఈ ఎన్నికల ఫలితాల విడుదలకు ఇంకా నెల సమయం ఉండటంతో అన్ని పార్టీల నేతలు టెన్షన్ గా గడుపుతున్నారు. ఓటరు దేవుడు ఏ నిర్ణయం తీసుకున్నాడా అని అందరూ ఆసక్తితగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్.. తమ పార్టీ కీలకనేతలు, అభ్యర్థులతో సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

అయితే... ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ మాత్రం చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం తమవైపే ఉందని ఆయన చాలా గట్టి నమ్మకం మీద ఉన్నారు. ఈ క్రమంలో.. ప్రశాంతంగా వేసవి సెలవలు ఎంజాయ్ చేయడానికి విదేశాలకు వెళుతున్నారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే.. ఐదేళ్ల పాటు ప్రజాసేవలో మునిగితేలాలి. కుటుంబంతో గడపడానికి కూడా తీరిక ఉండకపోవచ్చు.

అందుకే.. ఫలితాలు వెలువడటానికి ముందే జగన్ విదేశాలలో కుటుంబసభ్యులతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన అత్యంత శీతల ప్రాంతమైన స్విట్జర్లాండ్‌కు వెళ్లేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నారు.
 
కాసేపట్లో హైదరాబాద్‌ నుంచి స్విట్జర్లాండ్‌కు బయల్దేరనున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన విదేశి పర్యటనకు వెళ్తున్నారు. ఐదురోజుల పాటు స్విట్జర్లాండ్‌లో జగన్‌ విడిది చేయనున్నారు. తిరిగి ఈనెల 27 రాత్రి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. గత సంవత్సరం వేసవిలో కుటుంబసభ్యులతో కలిసి న్యూజిలాండ్‌ వెళ్లారు.

న్యూజిలాండ్‌లో ఆయన బంగీజంప్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. పర్యటనకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లడానికి ఆయన సీబీఐ కోర్టు అనుమతి తీసుకున్నారు. కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే