బాబు ఖర్చుపెట్టిన ప్రతి రూపాయిపై విచారణ చేస్తాం: బొత్స

Siva Kodati |  
Published : Apr 22, 2019, 01:40 PM IST
బాబు ఖర్చుపెట్టిన ప్రతి రూపాయిపై విచారణ చేస్తాం: బొత్స

సారాంశం

ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టిన రానున్న కాలంలో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ.

ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టిన రానున్న కాలంలో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. విశాఖలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి మీదా విచారణ జరుపుతామన్నారు.

చంద్రబాబు ఓటుకు రెండు వేలు, ఐదు వేలు ఇస్తారని జగన్ పదే పదే చెప్పారని బొత్స గుర్తు చేశారు. ఎన్నికల్లో టీడీపీ ధనాన్ని నమ్ముకుంటే.. వైసీపీ జనాన్ని నమ్ముకుందని సత్యనారాయణ స్పష్టం చేశారు.

జేసీ దివాకర్ రెడ్డి, చంద్రబాబు లాంటి వ్యక్తులు ఈ వ్యవస్థలో ఉండటం దురదృష్టకరమన్నారు. తెలుగుదేశం హయాంలో రాష్ట్రంలో అవనీతి రాజ్యమేలిందని బొత్స ఆరోపించారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే