టీచర్లను సైతం రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోంది: గురుపూజోత్సవం కార్యక్రమంలో సీఎం జగన్

By Sumanth KanukulaFirst Published Sep 5, 2022, 2:03 PM IST
Highlights

విద్యార్థులకు చదువుతో పాటు వ్యక్తిత్వాన్ని నేర్పేది గురువులేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. బతకడం ఎలాగో నేర్పించేది టీచర్లేనని చెప్పారు. తమ ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా తెలిపారు.

విద్యార్థులకు చదువుతో పాటు వ్యక్తిత్వాన్ని నేర్పేది గురువులేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. బతకడం ఎలాగో నేర్పించేది టీచర్లేనని చెప్పారు. తమ ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా తెలిపారు. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు సీఎం జగన్ పురస్కారాలు అందజేశారు. అంతుకుముందు మాట్లాడిన సీఎం జగన్.. తాను విద్యా శాఖపై చేసినన్ని సమీక్షలు మరే శాఖ మీద చేయలేదని అన్నారు. గత ప్రభుత్వం విద్యను కార్పొరేట్‌ను అమ్మేసిందని విమర్శించారు. మన విద్యా వ్యవస్థ ఎలా ఉందో అందరూ ఆలోచించాలని కోరారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో సంస్కరణలు అమలు చేస్తున్నామని చెప్పారు. అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉండేలా రాష్ట్ర విద్య వ్యవస్థలో మార్పులు చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందిండచమే కాకుండా మోనులో మార్పులు చేశామన్నారు. టీచర్లు తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎవరూ అడగపోయినా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చామని చెప్పారు. 

ఎవరూ అడక్కపోయినా టీచర్ల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచామని సీఎం జగన్ చెప్పారు. ఉద్యోగుల పెన్షన్ విషయంలో చిత్తశుద్దితో పనిచేస్తున్నామని అన్నారు. . ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమకు లేదన్నారు. టీచర్లను సైతం రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షం ప్రయతిస్తోందని ఆరోపించారు.

click me!