రేపు వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటన.. బ్యారేజ్ లు జాతికి అంకితం ఇవ్వనున్న సీఎం...

Published : Sep 05, 2022, 11:51 AM IST
రేపు వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటన.. బ్యారేజ్ లు జాతికి అంకితం ఇవ్వనున్న సీఎం...

సారాంశం

రేపు ఏపీ సీఎం వైఎస్ జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ ను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. 

అమరావతి : మంగళవారం ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పర్యటన చేయనున్నారు. పెన్నానదిపై సంగం వద్ద నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ప్రారంభించనున్నారు సీఎం. దాని అనంతరం అక్కడ జరిగే బహిరంగసభలో జగన్ మాట్లాడతారు. ఆ తర్వాత నెల్లూరు చేరుకుని నెల్లూరు బ్యారేజ్‌ కమ్‌ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. బ్యారేజ్ లను ప్రారంభించిన అనంతరం సీఎం జగన్ వీటిని జాతికి అంకితం చేయనున్నారు.  

మంగళవారం వైఎస్ జగన్ షెడ్యూల్ ఇలా ఉంది.. 
- 6వ తేదీ ఉదయం 9.30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరనున్న సీఎం జగన్

-10.40 గంటలకు సంగం బ్యారేజ్ వద్దకు చేరుకుంటారు.

- 11 గంటల నుంచి 1.10 వరకూ మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ ను ప్రారంభించి, అక్కడే బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం వైఎస్ జగన్.

- 1.20 గంటలకు సంగం నుంచి బయదేరి  1.45 కు నెల్లూరు బ్యారేజి సైట్ కు చేరుకోనున్న సీఎం జగన్.

-1.50 గంటల నుంచి 2.20 గంటల వరకూ నెల్లూరు బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ ని ప్రారంభించనున్న సీఎం జగన్.

- 2.20 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి సాయంత్రం 4.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం జగన్.

అనంతపురం జిల్లా డోనెకల్ వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. బళ్లారి వెళ్తుండగా ఘటన

PREV
click me!

Recommended Stories

Chandrababu Speech: చంద్రబాబు సినిమా డైలాగ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu
మండుటెండల్లో చంద్రబాబు.. వేమిరెడ్డి సూపర్ స్పీచ్ | Vemireddy Prabhakar Reddy Speech | Asianet Telugu