ఏపీకి కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు.. బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ 2‌ ప్రారంభోత్సవంలో సీఎం వైఎస్ జగన్

Published : Feb 17, 2022, 03:23 PM IST
ఏపీకి కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు.. బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ 2‌ ప్రారంభోత్సవంలో సీఎం వైఎస్ జగన్

సారాంశం

దేశవ్యాప్తంగా రహదారుల అభివృద్ది వేగంగా సాగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. విజయవాడ బెంజిసర్కిల్‌పై ఫ్లై ఓవర్ సహా.. రాష్ట్రంలో రూ.11,157 కోట్లతో నిర్మించిన 20 రహదారులు, ఇతర ప్రాజెక్ట్‌లను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రారంభించారు.

దేశవ్యాప్తంగా రహదారుల అభివృద్ది వేగంగా సాగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. విజయవాడ బెంజిసర్కిల్‌పై ఫ్లై ఓవర్ సహా.. రాష్ట్రంలో రూ.11,157 కోట్లతో నిర్మించిన 20 రహదారులు, ఇతర ప్రాజెక్ట్‌లను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రారంభించారు. అలాగే ఏపీలో 31 జాతీయ రహదారులకు ఆయన సీఎం జగన్‌తో కలిసి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 51 ప్రాజెక్టులకు ముందడుగులు పడుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు అని సీఎం జగన్ చెప్పారు.  

కేంద్రం అండతో రాష్ట్రంలో రోడ్ల రూపురేఖలు మారుస్తామని సీఎం జగన్ తెలిపారు. రహదారుల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. భూ సేకరణతో పాటు అన్ని అంశాల్లో వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని అన్నారు. జాతీయ రహదారులు కాకుండా రాష్ట్రంలోని ఇతర రహదారుల పనులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా చెప్పారు. వాటి అభివృద్దికి  రూ. 10,600 కోట్లను కేటాయించినట్టుగా సీఎం జగన్ తెలిపారు. ఏపీలో ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ లైన్ రోడ్డు ఉండేలా చర్యలు చేపట్టామని తెలిపారు. 

విజయవాడలో ట్రాఫిక్ సమస్య లేకుండా బైపాస్‌ల అభివృద్దికి, విశాఖపట్నం-భోగాపురం మధ్య ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి, ఈస్టర్న్ బైపాస్‌కు కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. రాష్ట్ర అభివృద్దికి తెలుగువారైన కిషన్ రెడ్డి సహకరిస్తున్నారని.. ఆయన నుంచి మరింత సహకారం కావాలని సీఎం జగన్ ఆకాక్షించారు. 

అంతకు ముందు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎయిర్ , పోర్ట్, సీ కనెక్టివిటీలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన అనేక పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వైద్య రంగానికి సంబంధించి అనేక పరికరాలు తయారుచేసే ప్రాంతంగా విశాఖ వృద్ధి చెందుతోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో టాయిలెట్లు, వంటగ్యాస్ కనెక్షన్లు సహా పేదలకు ఆర్ధిక సహకారం అందిస్తున్నామన్నారు. కోవిడ్ పరిస్ధితుల్లోనూ ఇలాంటి సభ నిర్వహిస్తున్నామంటే  దానికి వ్యాక్సినేషనే కారణమని  కిషన్ రెడ్డి వెల్లడించారు. 

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మనదేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 175 కోట్ల వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్‌లో జరుగుతోందని .. 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ కార్యక్రమం చేపట్టామని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలో ఈ తరహా కార్యక్రమం నిర్వహిస్తోంది ఒక్క భారత్ మాత్రమేనని ఆయన చెప్పారు

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే
Roja vs Kirrak RP: నీ పిల్లల ముందు ఇలాంటి మాటలు అనగలవా? రోజాకు గట్టిగా ఇచ్చేసిన కిర్రాక్ ఆర్పి