Latest Videos

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ ధరలు భారీగా పెంచాలని నిర్ణయం తీసుకున్న టీటీడీ పాలకమండలి..

By Sumanth KanukulaFirst Published Feb 17, 2022, 2:35 PM IST
Highlights

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గురువారం సమావేశమైన టీటీడీ పాలక మండలి.. ప్రధానంగా 2022-23 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. రూ. 3వేల 171 కోట్ల అంచనాగా బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేసింది. 

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గురువారం సమావేశమైన టీటీడీ పాలక మండలి.. ప్రధానంగా 2022-23 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. రూ. 3వేల 171 కోట్ల అంచనాగా బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేసింది. ఇక, సిఫార్సు లేఖలపై ఆర్జిత సేవా టికెట్ల ధరల పెంచాలని నిర్ణయం తీసుకుంది. సుప్రభాతం రూ. 2 వేలు, తోమాల, అర్చన రూ. 5 వేలు, కల్యాణోత్సవం రూ. 2,500, వేద ఆశీర్వచనం రూ. 10 వేలుగా నిర్ణయించింది. వస్త్రాలంకరణ సేవా టికెట్ ధర రూ. లక్షకు పెంచింది. 

ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు చేయాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. అన్నమయ్య నడకమార్గాన్ని అభివృద్ది చేయాలని నిర్ణయం తీసుకుంది. అలిపిరి వద్ద ఆధ్యాత్మిక సిటీ నిర్మాణం చేపట్టాలని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సైన్స్ సిటీకి కేటాయించిన భూములను వెనక్కి తీసుకుంటున్న నేపథ్యంలో అదే స్థలంలో ఆధ్యాత్మిక నగరాన్ని 50 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని చూస్తుంది. 

టీడీడీ తీసుకన్న మరిన్ని నిర్ణయాలు..
-రూ. 230 కోట్లతో పద్మావతి చిన్నపిల్లల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం 
-రూ. 2.7 కోట్లతో స్విమ్స్ హాస్పిటల్ పూర్తిగా కంప్యూటీకరణ
-ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలకు రూ. 25 కోట్ల కేటాయింపు 
-తిరుమలలో అన్నప్రసాదాన్ని మరిన్ని ప్రదేశాలలో అందించేందుకు నిర్ణయం 
-నాదనీరాజనం మండపాన్ని శాశ్వత ప్రతిపాదిక నిర్మాణం
-రూ. 3.6 కోట్లతో ఆయుర్వేద ఫార్మసీ అభివృద్ది 

త్వరలోనే పూర్తి స్థాయిలో సర్వదర్శనాలు..
తిరుమలలో ప్రైవేట్ హోటళ్లను పూర్తిగా తొలగించనున్నట్టుగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో భక్తులందరికీ ఒకే రకమైన భోజనం అందజేస్తామని చెప్పారు. ప్రధాని నుంచి సామాన్యుడి వరకు అందరికి ఒకే రకమైన భోజనం ఉంటుందన్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో సర్వదర్శనాలను ప్రారంభించనున్నట్టుగా ప్రకటించారు. కేంద్రం అనుమతులు వచ్చాక మూడో ఘాట్ రోడ్డు నిర్మాణం చేపడతామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 

click me!