2019లో వైసిపి గెలుచుకునే సీట్లెన్నో తెలుసా ?

First Published Nov 22, 2017, 7:15 AM IST
Highlights
  • వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు.

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. ఎన్నికలొస్తే తమ పార్టీకి ఎన్ని సీట్లు వస్తుందనే అంచనాలో నేతలుండటం సహజమే. కానీ ఖచ్చితంగా ఇన్ని సీట్లు వస్తుందని మాత్రం ఎక్కడా ప్రకటించరు. ఎందుకంటే, ఆ సంఖ్యకు కొద్దిగా అటు ఇటు అయితే పర్వాలేదు కానీ బాగా తేడా కొడితే మాత్రం సమాధానం చెప్పుకోలేరు. అయితే, చాలా అరుదుగా మాత్రమే పార్టీల అధినేతలు గెలుచుకోబోయే స్ధానాలపై ప్రకటనచేస్తారు.

1994 ఎన్నికల సందర్భంగా తిరుపతిలో ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీకి 227 సీట్లు వస్తాయని ప్రకటించారు. అదేమి లెక్క అని మీడియా అడిగితే రాకపోతే అడగండి అంటూ సవాలు విసిరి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఫలితాలు చూస్తే దాదాపు అన్నే సీట్లు వచ్చాయి. అటువంటిది చాలా రేర్ గా జరుగుతుంది. ఇక ప్రస్తుత విషయానికి వస్తే జగన్ కూడా అటువంటి సాహసమే చేశారు. గొర్లగుంటలో మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ  వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 137 స్ధానాల్లో గెలుస్తుందని ఢండా భజాయించి మరీ ప్రకటించారు. బహుశా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత కిషోర్ ఏమైనా సర్వేలు నిర్వహించి వేదిక  ఇచ్చారా అన్న అనుమనాలు మొదలయ్యాయి. ఎందుకంటే, ప్రశాంత్ కొంతకాలంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా సర్వేలు కండక్ట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

సరే, అదైపోయిన తర్వాత ప్రభుత్వంపై మండిపడ్డారు. పోయిన ఎన్నికల సమయంలో చంద్రబాబు అనేక హామీలిచ్చి జనాలను మోసం చేసినట్లు ఆరోపించారు. ప్రజలను మోసం చేసిన ఏ ప్రభుత్వానికైనా పతనం తప్పదంటూ హెచ్చరించారు. తన పాదయాత్రలో యువత, మహిళలు, ఉద్యోగులు తన వద్దకు నేరుగా వచ్చి తమ సమస్యలను చెప్పుకుంటున్నారంటేనే ప్రభుత్వంపై వ్యతిరేకత ఎంతగా ఉందో అర్ధమవుతోందన్నారు. పేదలకుపయోగపడే ఆరోగ్య శ్రీ పథకాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేసినట్లు మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో రైతులు కూడా నానా అవస్తలు పడుతున్నట్లు ధ్వజమెత్తారు. 2019లో తమ ప్రభుత్వం వస్తుందన్నారు. అప్పుడు ఇప్పటికే ప్రకటిచిన నవరత్నాలు అమలు చేసి పేదలు మెచ్చే పాలనను అందిస్తామని హామీ ఇచ్చారు.

click me!