
పాత నగరంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో గల ఒడిషా స్టీవ్ డోర్స్ కంపెనీ కార్యాలయంలో వింత జీవులు చేరినట్లు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా తో పాటు పత్రికలలో వస్తున్న వార్తలపై స్పందించి అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు మంగళవారం మధ్యాహ్నం వాటిని పట్టుకున్నారు. మనిషి ఆకారంలో వింతగా నిలబడిన ఈ పక్షులు అరుదైన గుడ్లగూబ జాతికి చెందినది అని నిర్దారించారు. వీటి సంరక్షణ కోసం విశాఖ జూ పార్క్ అధికారులకు అపగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇంత వరకు ఏ గ్రహాంతర జీవులో వచ్చాయంటూ హాట్ టాపిక్ గా మారిన ఈ వార్త నగరంలో కొద్దిరోజులుగా సంచలనం సృష్టించింది. ఎట్టకేలకు అవి గ్రహాంతర జీవులు కాదని అరుదైన గుడ్లగూబ జాతికి చెందిన పక్షులని నిర్దారణైంది. ఈ గుడ్లగూబ పిల్లలు ఒక్కొక్కటి అడుగున్నార పొడవు ఉన్నాయి. అయితే తల్లి పక్షి లేని సమయంలో అటవీశాఖ అధికారులు వీటి పట్టుకున్నారు.