టైమ్ వచ్చినప్పుడు చెప్తా, బాబును అడిగితే చెప్తారు: రాహుల్ పై జగన్ విసుర్లు

First Published Jul 21, 2018, 10:51 AM IST
Highlights

అవిశ్వాస తీర్మానంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

కాకినాడ: అవిశ్వాస తీర్మానంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు జవాబు చెప్పడానికి ఆయన నిరాకరిస్తూ సమయం వచ్చినప్పుడు చెప్తానని, టాపిక్ డైవర్ట్ చేయవద్దని అన్నారు. 

"మీరు ఇదే ప్రశ్న సీఎం చంద్రబాబును అడిగితే సమాధానం వస్తుంది.  టాపిక్‌ను డైవర్ట్ చేయడం వద్దు అన్నా. ఇవాళ ప్రత్యేక హోదా కోసం మాత్రమే పెట్టిన ప్రెస్‌మీట్. డైవర్ట్ అయితే ఈ మాటలే హైలైటవుతాయి. హోదా అనే అంశం మరుగున పడుతుంది. మీరు అడిగిన ప్రశ్నకు సరైన సమయంలో.. సరైన రీతిలో అన్నీ చెబుతాను" ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎందుకు డిమాండ్ చేయలేదనిఆయన ప్రశ్నించారు. రాహుల్ తన ప్రసంగంలో ఏపీ అంశాలపై అర నిమిషం కూడా ప్రస్తావించలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇస్తామని, ఇవ్వాల్సిన బాధ్యత తమదే అనే మాట ప్రధాని నోటి నుంచి రాలేదని అన్నారు. 

గల్లా జయదేవ్ ప్రసంగంపై జగన్ పెదవి విరిచారు. " గల్లా మాట్లాడిన మాటలు గత నాలుగేళ్లుగా మేం చెబుతున్న మాటలు కాదా..?. గత నాలుగేళ్లుగా యువభేరీ మొదలుకుని అసెంబ్లీ వరకు మేం చేసిన ప్రసంగాలు.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా మేం చేసిన ధర్నాలను ఒక్కసారి చూడండి. నాలుగేళ్లుగా మేం మాట్లాడిన మాటలే గల్లా జయదేవ్ కూడా పార్లమెంట్‌లో చెప్పాడంతే" అని ఆయన కొట్టిపారేశారు.

click me!